2008 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ ప్రస్థానం మొదలు పెట్టింది. 2014లో బెంగళూరు జట్టుకు కెప్టెన్ గా మారిపోయాడు విరాట్ కోహ్లీ. ఇక అప్పటినుంచి బెంగళూరు జట్టు అనగానే విరాట్ కోహ్లీ గుర్తుకువస్తాడు. అలా ఎంతో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడూ. అయితే ఇటీవలే టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
దీంతో అభిమానులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇకపోతే ప్రస్తుతం మెగా వేలం నేపథ్యం లో బెంగుళూరు తర్వాత కెప్టెన్ ఎవరు అన్నది మరో సారి చర్చకు తెర మీదకు వచ్చింది. అయితే ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్గా సౌత్ ఆఫ్రికామాజీ కెప్టెన్ ఫాబ్ డుప్లెసిస్ కాబోతున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇటీవలే మెగా వేలంలో పోటీ పడి మరీ ఫాబ్ డుప్లెసిస్ ని 7 కోట్లకు సొంతం చేసుకుంది బెంగళూరు ప్రాంచైజీ. అయితే డూ ప్లెసిస్ బెంగళూరు జట్టుకుకెప్టెన్ గా అవ్వడం ఖాయం అంటూ ఇటీవల మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా అభిప్రాయం వ్యక్తం చేశాడు. అతనికున్న అనుభవం దృశ్య అతనికి బెంగళూరు కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉంది అంటూ తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి