ప్రతి ఆటగాడు సెంచరీ చేస్తాడు. ఇక ఇతను కూడా అలాగే చేశాడు ఇందులో కొత్తేముంది అని అనుకుంటున్నారు కదా.. కొత్త కాదు గుండెలవిసె ఒక బాధ దాగి ఉంది. విష్ణు సోలంకి సెంచరీ సాధించడం వెనుక ఒక విషాద గాధ ఉంది. కొన్ని రోజుల క్రితమే విష్ణు సోలంకి కూతురు అనారోగ్యంతో మరణించింది. పుట్టిన కొద్ది రోజులకే ఆరోగ్య సమస్యలతో పసికందు కన్నుమూయడంతో విష్ణు సోలంకి ఎంతో బాధలో మునిగిపోయాడు. ఇక ఇలా కూతురు చనిపోయిన సమయంలో రంజీ ట్రోఫీ లో ఎంతో బిజీగా ఉన్నాడు విష్ణు సోలంకి. కూతురు చనిపోయింది ఆమె మరణవార్త అతనికి చేరగానే అతని గుండె పగిలిపోయింది.
వెంటనే హుటాహుటిన బయలుదేరి కూతురు అంత్యక్రియలు నిర్వహించడం విశేషం. సోలంకి ఇక ఆట మీద మక్కువతో కూతురు చనిపోయింది అని బాధను దిగమింగుకుని మళ్ళీ మైదానంలోకి వచ్చేశాడు. వస్తు వస్తూనే చండీఘర్ తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టాడు. ఇలా పుట్టిన బిడ్డల చనిపోయిన బాధను దిగ మింగుకుని కూడా సెంచరీతో మెరిసిన విష్ణు సోలంకి గురించి తెలిసిన తర్వాత మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు అందరూ. ఈ క్రమంలోనే తన గురించి తెలిసిన ఎంతోమంది అతని ఆటకు సలాం అంటూ కామెంట్ లు పెడుతూ ఉండడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి