అయితే ఇటీవలే టెస్టు ఫార్మాట్లో కూడా సత్తాచాటిన రోహిత్ శర్మ శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది ఘన విజయాన్ని అందుకున్నాడు. అయితే ఇప్పటి వరకు టీమిండియా టెస్టు క్రికెట్ లో మాజీ సారథి విరాట్ కోహ్లీ అత్యుత్తమ కెప్టెన్లలో ఎంతగానో గుర్తింపు సంపాదించాడు. ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం కొత్త సారథి రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ కోహ్లి కన్నా విజయవంతమైన టెస్ట్ సారధిగా నిలుస్తాడని ఇండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ క్రీడా చానెల్తో మాట్లాడుతూ వసీం జాఫర్ తన మనసులో ఉన్న విషయాలను బయట పెట్టేసాడు.
రోహిత్ శర్మ ఖచ్చితంగా విరాట్ కోహ్లీ కంటే విజయవంతమైన సారథిగా టెస్టు ఫార్మాట్లో నిలుస్తాడు. అతడు ఎన్ని టెస్టులకు నాయకత్వం వహిస్తాడో తెలియకపోయినా అతడు మాత్రం మేటి కెప్టెన్లలో ఒకరిగా ఉంటాడనే నమ్మకం మాత్రం ఉంది. ఇటీవలే టీమిండియా సాధించిన వరుస విజయాల ఇది చెప్పకనే చెబుతున్నాయి. ఇక టీమిండియా సాధించిన విజయాలు చూస్తుంటే భారత కెప్టెన్సి సరైన వ్యక్తి చేతుల్లోకి వెళ్లిందని నాకు అనిపిస్తుంది అంటూ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఇటీవల రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా పదిహేను మ్యాచులో కూడా విజయం సాధిస్తూ వచ్చింది టీమిండియా..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి