గత కొన్ని సీజన్ల నుంచి పేలవ ప్రదర్శన చేస్తూ అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఇక ఇలా నిరాశపరిచినప్పుడల్లా జట్టులో మార్పులు కావాలి అంటూ అభిమానులు డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన మెగా వేలంలో ఎంతో మంది కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. దీంతో ఈ సారి మిగతా జట్ల లాగానే సన్రైజర్స్ కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక కేన్ విలియమ్సన్ జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాళ్లను ఉపయోగించుకుంటూ ఎలా జట్టుకు విజయం అందించబోతున్నాడు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇకపోతే 2022 సీజన్ ఐపీఎల్ లో భాగంగా నేడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటి మ్యాచ్ ఆడబోతుంది. ఇక మొదటి మ్యాచ్లో భాగంగా అటు రాజస్థాన్ రాయల్స్ జట్టు తో తలపడుతుంది. అయితే గత ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో ఇక ఈ రెండు జట్లు కూడా తీవ్రంగా నిరాశ పరిచాయి. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచాయి ఈ రెండు జట్లు. మరి ఈసారి ఎలా ప్రదర్శన కొనసాగిస్తాయి అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే రాజస్థాన్ సన్రైజర్స్ మధ్య ఇప్పటి వరకు 15 మ్యాచ్ లు జరగగా ఇందులో సన్రైజర్స్ 8 రాజస్థాన్ 7 మ్యాచ్లలో విజయం సాధించాయి. ఇక సన్రైజర్స్ భోణి కొట్టాలని తెలుగు ప్రేక్షకులందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి