అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ మూడు మ్యాచ్లు ఆడింది. ఇక ఈ మూడు మ్యాచ్ లలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడూ రుతురాజ్ గైక్వాడ్ అనుకున్నంత స్థాయిలో మాత్రం ప్రదర్శన చేయలేకపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా మూడు మ్యాచ్ల్లో కూడా ఓటమి చవి చూసింది. అయితే ఇక చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఇకపోతే ఇటీవలే చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తీరుపై మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ లో ఒక సమస్య ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. స్వింగ్ అయ్యే బంతులను రుతురాజ్ గైక్వాడ్ ఆడలేదని తెలిపాడు వసీం జాఫర్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ను ఈ సమస్య చూసినట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మ్యాచ్ లలో రూతు రాజు 0,1,1 పరుగులతో పూర్తిగా విఫలం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు ఆటతీరుపై ఓ క్రీడా చానల్ తో మాట్లాడినా వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి బ్యాట్ కు తగిలి ఇక వికెట్ల వెనకాల దొరికి పోతుంటాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. అయితే ఐపీఎల్ జరుగుతున్న ముంబైలో పిచ్ లు ఫాస్ట్ బౌలర్ కు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఇక దుబాయ్ లో ఉన్న పిచ్ ల లాగా కాకుండా ముంబై లో ఉన్న పిచ్ లలో లో బంతులు కాస్త స్వింగ్ అవుతూ ఉంటాయి. రుతురాజ్ గైక్వాడ్ మంచి ప్లేయర్ అయినప్పటికీ స్వింగ్ బౌలింగ్ ను ఎక్కువగా ఆడ లేడు. ఇక తన తప్పును సరిదిద్దుకునేందుకు కొత్త మార్గాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి