టీమ్ ఇండియా లో సీనియర్ స్పిన్నర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో ఎప్పుడూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అంతేకాదు ప్రతి విషయంలో కూడా ఎంతో గొప్పగా తెలివిగా ఆలోచిస్తూ ఉంటాడు రవిచంద్రన్ అశ్విన్. ఏ బ్యాట్స్ మెన్ కు ఎలాంటి బంతి సంధిస్తే ఇక వికెట్ దొరుకుతుంది అన్నది రవిచంద్రన్ అశ్విన్ కి బాగా తెలుసు అని చెప్పాలి. అందరూ స్పిన్నర్ల కంటే కాస్త భిన్నంగా తన  బౌలింగ్లో వైవిధ్యాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇక ఐపీఎల్ లో కూడా అదరగొడుతు ఎప్పుడూ తన పేరు మారుమోగిపోయేలా చేస్తూ ఉంటాడు రవిచంద్రన్ అశ్విన్. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కొనసాగిన అశ్విన్ మెగా వేలంలో కి వదిలీ చేయబడ్డాడు.


 దీంతో అతని కోసం పోటీపడి మరీ రాజస్థాన్ రాయల్స్ జట్టు సొంతం చేసుకుంది. ఇక ఇదే జట్టులో మరో విన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా ఉండటం గమనార్హం. ఇకపోతే రవిచంద్రన్ అశ్విన్ అప్పట్లో ప్రపంచ క్రికెట్ లో మొదటి సారి మన్కడింగ్ విధానం లో వికెట్ తీసి సంచలనమే సృష్టించాడు. ప్రపంచ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఆ సమయంలో అశ్విని తిట్టిన వారు కొంత మంది అయితే ఇక క్రికెట్ రూల్స్ బాగా పాటించాడు అని ప్రశంసించిన వారు మరికొంతమంది. ఇటీవలే మరోసారి ఇలాంటిదే చేసి సంచలనం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున బ్యాటింగ్ కు దిగిన రవిచంద్రన్ అశ్విన్ మొదట బాగా రాణించాడు. ఇక ఆ తర్వాత అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు.


 రిటైర్డ్ ఔట్ గా పెవిలియన్ చేరాడు రవిచంద్రన్ అశ్విన్. ఇది కూడా ప్రపంచ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇదే విషయంపై స్పందించిన రాజస్థాన్ కోచ్ కుమార సంగక్కర ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఒత్తిడిలోనూ అశ్విన్ బాగా బ్యాటింగ్ చేశాడు. తర్వాతి ఆటగాడి కోసం రిటైర్డ్ ఔట్ గా కావాలా వద్దా అన్న విషయాన్ని గ్రౌండ్ నుంచి అతను మిమ్మల్ని అడిగాడు.  వెంటనే నిర్ణయం తీసుకుని మేము ఓకే చెప్పామ్. ఇక అటు వెంటనే రవిచంద్రన్ అశ్విన్ రిటైర్డ్ ఔట్ గా పెవిలియన్ వైపు వచ్చేసాడు. ఇలా జట్టు కోసం తన బ్యాటింగ్ త్యాగం చేసిన అశ్విన్ ను చూస్తే ముచ్చటేస్తుంది అంటూ కుమార సంగక్కర వ్యాఖ్యానించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: