ఇకపోతే రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జాయింట్స్ మాత్రం ఆరంభంలో అదరగొట్టినా రాను రాను వారి ఆటతీరు మరీ దారుణంగా తయారవుతోంది. అయితే ఈ టీమ్ లో ముఖ్యంగా రాహుల్ మరియు డి కాక్ లపై ఎక్కువగా అధారపడుతోంది. అయితే గత మూడు మ్యాచ్ ల నుండి ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మార్కస్ స్టాయినిస్ వచ్చినా, అతనిని సరిగా వాడుకోవడంలో టీమ్ మేనేజ్మెంట్ ఫెయిల్ అవుతోంది. ఇక నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో లక్నో చేసిన బిగ్ మిస్టేక్ ఏమైనా ఉంది అంటే అది మార్కస్ స్టాయినిస్ విషయం లోనే, ఎందుకంటే ఇతను గతంలో ఓపెనర్ గా సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
వన్ డౌన్ లోనూ తన సత్తా చూపించగలడు. అలాంటిది గత రెండు మ్యాచ్ ల నుండి సిక్స్త్ డౌన్ లేదా ఆఖరి ఓవర్ లలో దింపితే జట్టుకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఇది ఎవరి నిర్ణయంతో తెలియదు. కానీ అతి చెత్త ప్లాన్ అని చెప్పాలి. ఇలా ఆడించేటప్పుడు అతనిని జట్టు నుండి తప్పించడం మేలు అంటూ అభిమానులు విమర్శలు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి