దీంతో ఇక ముంబై ఇండియన్స్ ఓటమిపై ప్రస్తుతం అభిమానులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలు పోయాయి. ఇప్పుడు కనీసం పరువు నిలబెట్టుకునేందుకు అయినా విజయం కోసం ఆడండి అంటూ ఘాటుగానే కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఓటమి అనంతరం మాట్లాడిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన బ్యాటింగ్ యూనిట్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అనాలోచిత నిర్లక్ష్యపు షాట్లు తమ కొంప ముంచాయి అంటూ విచారణ వ్యక్తం చేశాడు. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్. అయినా మా బౌలర్లు మెరుగ్గా రాణించారు.
ప్రత్యర్థి మా ముందు ఉంచిన లక్ష్యం కూడా పెద్దది కాదు. భారీ భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయామ్. నాతో సహా మార్కెట్ లోని కొంతమంది బ్యాట్స్మెన్ లు నిర్లక్ష్యపూరిత షాట్లు ఆడి వికెట్ కోల్పోయారు. ఇదే మా విజయావకాశాలను దెబ్బ తీసింది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యర్థి జట్టు ఇలాంటి బాధ్యత తీసుకుంది కాబట్టి మాకు భంగపాటు తప్పలేదు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. తర్వాత మ్యాచ్ లో బాగా రాణించడానికి ప్రయత్నిస్తాం అంటూ తెలిపాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి