మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగుళూరు ఆరంభం నుండి రాజస్థాన్ వికెట్లను పడగొడుతూ వచ్చింది. ఏ దశలోనూ నిలకడగా ఆడనివ్వలేదు. గత మ్యాచ్ హీరోలు పడిక్కాల్ (7), బట్లర్ (8) లు తక్కువ స్కోర్ కే వెనుతిరిగారు. అయితే కెప్టెన్ శాంసన్ (27) కాసేపు భారీ షాట్ లతో అలరించినా అదే టెంపోను కంటిన్యూ చేయలేకపోయాడు. అశ్విన్ కాసేపు అలరించాడు, ఈ టోర్నీలో మొదటికే హన్స్ ను దక్కించుకున్న డారిల్ మిచెల్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఇలా పవర్ ప్లే లోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రాజస్థాన్. ఆ తర్వాత రియాన్ పరాగ్ చివరి వరకు ఉండి కనీసం ఆ స్కోర్ అయినా చేయడంలో కీలక పాత్ర వహించాడు.
బెంగుళూరు బౌలర్లు అందరూ విజృంభించారు అని చెప్పాలి. ముఖ్యంగా పవర్ ప్లే లో సిరాజ్ మరియు హాజిలీవూడ్ విసిరిన బంతులకు రాజస్థాన్ ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. హాసరంగా కూడా కీలక వికెట్లు తీసుకుని బెంగుళూరు పైచేయి సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. మరి ఇంతటి స్వల్ప లక్ష్యాన్ని బెంగుళూరు ఛేదిస్తుందా లేదా గత మ్యాచ్ లోలాగా విఫలం అయ్యి మరో ఓటమిని మూటగట్టుకుంటుందా అన్నది తెలియాలంటే కాసేపు వెయిట్ చేయాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి