ఈ క్రమంలోనే ఐపీఎల్ లో కూడా ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ఇక వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కోహ్లీపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయ్. ఈ క్రమంలోనే కోహ్లీ కొన్ని నెలల పాటు ఆటకు గుడ్ బై చెప్పేసి విశ్రాంతి తీసుకుని మళ్ళీ జట్టులోకి తిరిగి రావాలని సీనియర్లు సూచిస్తున్నారు. ఇకపోతే మొన్నటికి మొన్న హాఫ్ సెంచరీ చేసి మళ్లీ ఫాంలోకి వచ్చినట్లు కనిపించాడు విరాట్ కోహ్లీ. ఇక మరో సారి చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 30 పరుగులు మాత్రమే చేసి వికెట్లు చేజార్చుకున్నాడూ విరాట్ కోహ్లీ.
ఈ క్రమంలోనే ఎప్పుడు చూసినా విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ కు సంబంధించిన చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలే సుశాంత్ మెహత ఇంటర్వ్యూలో పాల్గొన్న డేవిడ్ వార్నర్ కోహ్లీ ఫామ్ గురించి ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీకి ఏమైనా సూచనలు ఇస్తారా అంటూ అడిగిన ప్రశ్నకు. ఏమీ లేదు మరో ఇద్దరు పిల్లల్ని కలిగి ఉండి వారి ప్రేమను ఆస్వాదించండి అటు ఫన్నీగా సమాధానమిచ్చాడు. ఫామ్ అనేది టెంపరరీ క్లాస్ ఎప్పటికీ శాశ్వతం కాదు. మనం దానిని కోల్పోకూడదు. ప్రపంచంలో ఏ ఆటగాడికైనా తన కెరీర్ లో ఇలాంటి ఒక దశ ఎదురవుతుంది ఎత్తుపల్లాలు చూడాల్సిందే. మీరు ఎక్కిన మెట్లు మళ్లీ రావడానికి మీరు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. కోహ్లీ బేసిక్స్ కు కట్టుబడి ఉంటే చాలు ఫాం అనేది పెద్ద విషయం కాదు అంటూ డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానించాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి