ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఎంతో ప్రతిష్టాత్మకమైన టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది అనే విషయం తెలిసిందే. జస్ప్రిత్ బూమ్రా కెప్టెన్సీలో  బరిలోకి దిగబోతోంది భారత జట్టు. ఇంగ్లండ్ జట్టుతో తలబడి గెలిచేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మకమైన విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే అటు టీమిండియా తొలి వన్డే మ్యాచ్ కూడా ఆడబోతుంది అని తెలుస్తోంది. టీమిండియా అనగానే పురుషుల జట్టు అనుకోకండి ఎందుకంటే వన్డే మ్యాచ్ ఆడబోయేది మహిళల జట్టు.


 ప్రస్తుతం టీమిండియా మహిళల జట్టు శ్రీలంక పర్యటన లో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ టి20 వన్డే సిరీస్ లు ఆడుతోంది. అయితే ఇప్పటికే శ్రీలంకతో టి20 సిరీస్ ఆడే భారత జట్టు వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుని సత్తా చాటింది. సొంతగడ్డపై శ్రీలంక ను అటు భారత జట్టు క్లీన్ స్వీప్ చేస్తుంది అని అనుకున్నప్పటికీ చివరి మ్యాచ్లో శ్రీలంక విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన మూడు వన్డేల సిరీస్ కూడా ప్రారంభమైంది అనేది తెలుస్తుంది.


 ఇక ఈ వన్డే సిరీస్లో భాగంగా తొలి వన్డే నేడు 10 గంటలకు పల్లెకెలె స్టేడియంలో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే టి20 సిరీస్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా ప్రస్తుతం వన్డే సిరీస్ లో కూడా విజయఢంకా మోగించాలి అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అదే సమయంలో ఆతిథ్యమిస్తున్న శ్రీలంక జట్టు వన్డే సిరీస్ లో విజయం సాధించి టీ20 సిరీస్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలి అని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇక ఈ వన్డే సిరీస్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అని అర్థమవుతుంది. కాగా నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: