ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా టి20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ లో కూడా విజయం సాధించి ఫుల్ జోష్ లో ఉంది  అన్న విషయం తెలిసిందే. ఇక ఇదే జోష్ లో వెస్టిండీస్ పర్యటనలో భాగంగా అటు శిఖర్ ధావన్ సారథ్యంలో వన్డే సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టింది టీమిండియా.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడపోతుంది అన్న విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చిన కారణంగా ప్రస్తుతం ఓపెనర్ శిఖర్ ధావన్ టీమిండియాకు సారథ్య బాధ్యతలు నిర్వహించనున్నారు. అయితే టీమిండియా వరుస విజయాల నేపథ్యంలో ప్రస్తుతం ఎప్పుడు కామ్ గా ఉండే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం ఫుల్ జోష్లో ఉన్నాడు అన్నది తెలుస్తుంది.


 శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటాడు. ఎంతో చలాకీగా ఉంటూ ఆసక్తికర వీడియోలను  సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వరకు ఇలా ఎన్నో వీడియోలతో అభిమానులను ఆకర్షించాడు. ఇక ఇటీవలే వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టిన నేపథ్యంలో ఒక ఆసక్తికర వీడియో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు శిఖర్ ధావన్. ఒకసారి ఈ వీడియోలో చూసుకుంటే ఇక అందరూ హాయ్ చెబుతున్నట్లుగా సౌండ్ వస్తుంది. ఈ క్రమంలోనే ముందుగా శిఖర్ ధావన్ అందరికీ హాయ్ చెబుతాడు.


 ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, తర్వాత ఇషాన్ కిషన్,  చాహల్,  జడేజా,  సిరాజ్ తమదైన శైలిలో హాయ్ అంటూ లోపలి నుంచి ఎంట్రీ ఇస్తారు. ఇక ఎప్పుడూ కామ్ గా కనిపించే హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం యువ ఆటగాళ్లకు అనుకరిస్తూ చిరునవ్వులు చిందిస్తూ హాయ్ చెబుతూ వెళ్ళిపోతాడు. అయితే అందరు ఆటగాళ్లు హాయ్ చెప్పడం ఒక ఎత్తయితే కోచ్ రాహుల్ ద్రవిడ్ చివర్లో వచ్చి హాయ్ చెప్పడం మరో ఎత్తు అని చెప్పాలి. ఈ వీడియో పై ఎంత మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. ద్రావిడ్ సార్ ఎప్పుడు మిమ్మల్ని ఇలా చూడలేదు... మిమ్మల్ని కూడా శిఖర్ ధావన్  యోయో భాయ్ గా మార్చేశాడు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: