అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ జరగబోతున్న నేపథ్యంలో ఇటీవల టీమిండియా ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే . ఐపీఎల్లో రాణించిన ఎంతోమంది యువ ఆటగాళ్లకు వరుసగా టీమిండియాలో అవకాశం ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో కూడా ఎంతో మంది యువ ఆటగాళ్లు అవకాశం దక్కించుకున్నారు. ఇక వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్  వన్డేలలో కి అరంగేట్రం చేసాడు అని చెప్పాలి. ఇప్పటికే టీ20 లో ఎంట్రీ ఇచ్చి తన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు ఆవేశ్ ఖాన్.


 ఇక ఇప్పుడు వన్డే ఫార్మాట్ క్రికెట్ లోకి కూడా అరంగేట్రం చేశాడు అనే చెప్పాలి.  ఇటీవల ఈ విషయాన్ని బీసీసీఐ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించినా టీమిండియా ఇక ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది అనే చెప్పాలి. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఈ క్రమంలోనే ఏకంగా వెస్టిండీస్ పై 12 సిరీస్ లు గెలిచిన జట్టు గా ప్రపంచ రికార్డును కూడా క్రియేట్ చేసింది.


 అయితే ఇటీవలే వన్డే క్రికెట్లో అరంగేట్రం చేసిన ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్ అటు ఐపీఎల్ లో కూడా సత్తా చాటాడు. 2021 ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో ఆవేశ్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి. అయితే గత ఏడాది రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన ఆవేశ్ ఖాన్ 16 మ్యాచ్ లలో 24 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం  వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతని కొనుగోలు చేసింది. లక్నో తరఫున 13 మ్యాచ్ల్లో 18 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. లక్నో కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ కి ఆవేశ్ ఖాన్ కి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: