భారత క్రికెట్లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా  గుర్తింపు సంపాదించుకున్నాడు చటేశ్వర్ పుజారా. టీమిండియా నయా వాల్ అంటూ ఒక బిరుదు కూడా సంపాదించుకున్నాడు. అయితే గత కొంత కాలం నుంచి పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న నేపథ్యంలో పూజారా ను జట్టు నుంచి పక్కనపెట్టింది బీసీసీఐ. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ లలో ఆడుతున్నాడు పూజారా. సస్సెక్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.


 అయితే ఇక్కడ ఇంగ్లాండ్ కౌంటి లలో ఏ ముహూర్తాన అడుగుపెట్టాడో తెలియదు కానీ అక్కడ పరుగుల వరద పారుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. సెంచరీలు డబుల్ సెంచరీలు చేస్తూ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే జట్టుకు విజయాన్ని అందిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం చటేశ్వర్ పుజారా బ్యాటింగ్ చూసి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇన్నాళ్ల పాటు తన లో దాగి ఉన్న మరో కోణాన్ని తన బ్యాటింగ్ లో చూపిస్తూ ఉన్నాడు.  ఇక ఇటీవలే ఇంగ్లాండ్ రాయల్ లండన్ వన్ డే కప్ లో కూడా పూజారా బ్యాటింగ్ తో అదరగొట్టాడు అని చెప్పాలి.


 సాధారణం గా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ గా గుర్తింపు సంపాదించుకున్న పూజారా  పేరు తీయగానే అతని నెమ్మదైన బ్యాటింగ్ మాత్రమే గుర్తు కొస్తుంది. కానీ మెరుపు బ్యాటింగ్తో మరో సారి ఆశ్చర్యపరిచాడు పూజారా. ససెక్స్ జట్టు తరఫున వన్డే టోర్నమెంట్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమం లోనే 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతే కాదు ఒకే ఓవర్ లో 22 పరుగులు సాధించాడు అని చెప్పాలి. ఈ క్రమం లోనే  పూజారా మెరుపు బ్యాటింగ్ కు సంబంధించిన వీడియో వైరల్ గా  మారిపోయింది. ఇక ఈ వీడియో చూసి అభిమానులు అందరూ ఆనందంలో మునిగి పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: