సాధారణంగా మ్యాచ్ లో ఎవరైనా స్టార్ బ్యాట్స్మెన్ వున్నారంటే చాలు ప్రేక్షకుల దృష్టి మొత్తం వారి మీదే ఉంటుంది. వారు ఎలాంటి బ్యాటింగ్ ప్రదర్శన చేస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఎలాంటి అంచనాలు లేని ఆటగాళ్ళు బాగా రాణించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కాగా డుప్లెసిస్, మాక్స్వెల్ లాంటి ఆటగాళ్ళు ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది.. అంతర్జాతీయ క్రికెట్లో తమ దేశాల తరపున ఇద్దరు ఆటగాళ్లు కూడా ఎన్నోసార్లు అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడారు.


 ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ లో స్టార్ క్రికెటర్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నారు. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ క్రికెట్ టోర్నీలో ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు అనే చెప్పాలి. నార్తర్న్ సూపర్ చార్జర్, లండన్ స్పిరిట్ జట్ల మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్లో ఒక అద్భుతమైన దృశ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా జరుగుతున్న మ్యాచ్లో స్టార్ ప్లేయర్స్  అందరి దృష్టి వారి పైనే ఉంది. ఇలాంటి సమయంలోనే ఎలాంటి అంచనాలు లేని యంగు ప్లేయర్ తన మెరుపు ఇన్నింగ్స్ తో ఏకంగా మ్యాచ్ మొత్తానికి హైలెట్ గా నిలిచాడు అని చెప్పాలి.


 ఆ యువ ఆటగాడు పేరు ఆడమ్ రోసింగ్ టన్. ప్రస్తుతం అతని గురించే అందరూ చర్చించుకుంటున్నారు. దీనికి కారణం అతను ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ అని చెప్పాలి. ఇటీవలే జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ లో ఊచకోత అంటే ఎలా ఉంటుందో తన ఇన్నింగ్స్ తో చూపించాడు.  హెడింగ్లి  మైదానం వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో   బ్యాట్స్మెన్ ల నుంచి పరుగులు వెల్లువలా వచ్చాయి అని చెప్పాలి. సూపర్ ఛార్జర్స్ తరపున డూప్లేసెస్  35 బంతుల్లో 54 పరుగులు చేయగా నిర్ణీత 100 బంతుల్లో 143 పరుగులు చేశారు. ఇలాంటి సమయంలో లండన్ జట్టులో ఉన్న మ్యాక్స్వెల్ చెలరేగి అడాడు. అతని కంటే ముందు ఆడమ్ రోసింగ్ టన్  తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ది 100 లీగ్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్థ సెంచరీ కొట్టిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: