దూకుడుగా ఆడబోయిన సూర్యకుమార్ (15; 10 బంతుల్లో 2x4)ను హ్యారిస్ రౌఫ్ ఔట్ చేశాడు. 6.1వ బంతికి అక్షర్ పటేల్ (2) రనౌట్ అవ్వడంతో టీమ్‌ఇండియా 31-4తో తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య క్రీజులో నిలబడ్డారు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ బంతికి అలవాటు పడ్డారు. అందివచ్చిన బంతుల్ని బౌండరీకి పంపించారు. ఐదో వికెట్‌కు 78 బంతుల్లో 113 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. 10 ఓవర్లకు 45-4గా ఉన్న స్కోరును 15 ఓవర్లకు 100-4కు తీసుకెళ్లారు. ఆఖరి 30 బంతుల్లో 60 పరుగులు అవసరమైన తరుణంలో విరాట్ కోహ్లీ తన అనుభవాన్ని చాటాడు. చూడచక్కని షాట్లతో పాక్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. సమీకరణాన్ని 12 బంతుల్లో 31గా మార్చాడు.
19వ ఓవర్ ఆఖరి రెండు బంతుల్ని సిక్సర్‌గా మలిచి 15 రన్స్ రాబట్టాడు. చివరి 6 బంతుల్లో టీమ్‌ఇండియాకు 16 రన్స్ కావాలి. తొలి బంతికే హార్దిక్ ఔటయ్యాడు. తర్వాతి 2 బంతుల్లో 3 రన్స్ వచ్చాయి. నోబాల్‌గా వేసిన నాలుగో బంతిని విరాట్ సిక్స్ బాదేశాడు. ఫ్రీహిట్ బంతికి 3 పరుగులు తీశాడు. 5వ బంతికి దినేష్ కార్తీక్ (1) ఔటవ్వడంతో 2 బంతుల్లో 2 రన్స్ అవసరం అయ్యాయి. బౌలర్ లెగ్‌సైడ్ వేసిన బంతిని యాష్ (1*) ప్రశాంతంగా వదిలేశాడు. ఆఖరి బంతిని ఫీల్డర్ల మీదుగా పంపించి సింగిల్ తీసి విజయం అందించాడు.ఈ విజయాన్ని ఇప్పుడు దేశమంతా కూడా అసలైన దీపావళి పండుగ లాగా సెలబ్రేట్ చేసుకుంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి