కట్ చేస్తే ఇప్పుడు ఆ జట్టు ఆస్ట్రేలియా లో జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ లో తాను ఆడిన రెండవ మ్యాచ్ లో తనకన్నా ఎంతో బలమైన మరియు టైటిల్ ఫేవరెట్ గా చెప్పుకున్న ఆసియా జట్టు పాకిస్తాన్ ను ఓడించింది. ఇప్పుడు ఈ విషయం బాగా వైరల్ అవుతోంది. మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ జింబాబ్వే కు బ్యాటింగ్ అప్పగించింది. అయితే దొరికిన ఆరంభాన్ని సరిగా వినియోగించుకోని జింబాబ్వే మిడిల్ ఆర్డర్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అలా చివరికి నిర్ణీత ఓవర్ లలో 130 పరుగులకు పరిమితం అయింది. పాకిస్తాన్ ఈ లక్ష్యాన్ని ఉప్ మని ఊదేద్ధాం అనుకున్నారు. కానీ జింబాబ్వే టీమ్ బలమైన సంకల్పం ముందు పాకిస్తాన్ పప్పులు ఏమీ ఉడకలేదు.
ఈ టోర్నీలో మరోసారి పాక్ ఓపెనర్లు విఫలం కావడంతో జింబాబ్వే విజయానికి బాగా కలిసి వచ్చింది. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్ లో 1 రన్ తేడాతో జింబాబ్వే చరిత్ర సృష్టించింది. ఈ దెబ్బతో వరల్డ్ కప్ లో సెమీఫైనల్ కు చేరే అవకాశాలు దాదాపు కోల్పోయినట్లే. ఇంకేమైనా అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ సెమిస్ చేరే ఛాన్స్ లు లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి