ఈ క్రమంలోనే ఇక టీమిండియా మాజీ ఆటగాళ్లు అయితే ఇలా రివ్యూలు ఇవ్వడంలో కాస్త అప్డేట్ గా ఉంటారు అని చెప్పాలి. అందుకే ఎప్పుడు టీమిండియ ఆటగాళ్ల ప్రదర్శన గురించి మ్యాచ్ ఫలితాలు గురించి కూడా చెబుతూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా తమ రెండవ మ్యాచ్ పసికూన నెదర్లాండ్స్ తో ఆడింది. ఈ క్రమంలో 56 పరుగులు తేడాతో విజయ డంకా మోగించి సత్తా చాటింది అని చెప్పాలి. ఇక ఈ విజయంతో టీమిండియా కు మెరుగైన రన్ రేట్ కూడా వచ్చింది అని చెప్పాలి.
అయితే నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లపై ఇటీవల స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ టీం లో సరిదిద్దుకోవాల్సిన లోపాలు ఇంకా చాలా ఉన్నాయి అంటూ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ మెరుగైందని కానీ బ్యాటింగ్లో మరిన్ని పరుగులు చేయాల్సిన అవసరం ఉంది అంటూ తెలిపాడు. చివరి 10 ఓవర్ లలో 100కు పైగా పరుగులు చేసి భారీ స్కోర్ చేసేలా చూడాలని సూచించాడు. అయితే ఇప్పటికి కూడా భారత్లో మెరుగైన బౌలింగ్ లేదని వైడ్లు, నోబాల్ విషయంలో దృష్టి సారించాలి అంటూ సలహా ఇచ్చాడు కపిల్ దేవ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి