తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కర్ణాటక రాష్ట్రము శివమొగ్గకు చెందిన యువ ఆటగాడు వరల్డ్ రికార్డ్ సాధించాడు. శివమొగ్గ ప్రాంతం సాగర్ క్రికెట్ క్లబ్ కు చెందిన తన్మయ్ మంజునాధ్ (16) భద్రావతి ఎన్టీసీసీ జట్టుతో వన్ డే మ్యాచ్ లో ఇతను 165 బంతులతో 407 పరుగుల భారీ స్కోర్ ను సాధించాడు. వాస్తవంగా అయితే వన్ డే మ్యాచ్ లో ఒక జట్టు చేసే మొత్తం పరుగులు ఒక వ్యక్తి చేయడం అరుదుగా జరుగుతుంది. తన జట్టు నిర్ణీత ఓవర్ లలో 583 పరుగులు చేయగా, అందులో 407 పరుగులు మంజునాధ్ ఒక్కడే చేయడం విశేషం. ఇతని ఇన్నింగ్స్ లో 48 ఫోర్లు మరియు 24 సిక్సులు ఉన్నాయి.
ఈ విద్వంసం ముందు వరకు వన్ డే లలో అత్యధిక స్కోర్ రికార్డ్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ శర్మ శ్రీలంకపై 173 బంతుల్లో 264 పరుగులు చేశాడు. అయితే మొదటిసారి అంతర్జాతీయ వన్ డే లలో డబుల్ సెంచరీ చేసింది సచిన్ టెండూల్కర్ మాత్రమే. ఆ తరువాత రోహిత్ శర్మ మూడు సార్లు డబుల్ సెంచరీ లు చేశాడు... మరియు పాకిస్తాన్ క్రికెటర్ ఫకర్ జమాన్ పేరిట ఒక డబుల్ సెంచరీ ఉంది. కానీ ఇపుడు తన్మయ్ మంజునాధ్ 407 పరుగులతో వరల్డ్ రికార్డ్ సాధించాడు. ప్రస్తుతం ఇతని పేరు మారుమ్రోగిపోతోంది. అయితే ఈ క్రికెటర్ భవిష్యత్తులో ఇంకెన్ని రికార్డులను అందుకుంటాడు అన్నది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి