ప్రస్తుతం కథార్ వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ప్రారంభమైన నాకౌట్ మ్యాచ్ లు అయితే రికార్డులతో హోరెత్తిపోతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న ఈ మ్యాచ్లను చూసేందుకు అటు క్రీడాభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తి చూపుతూ ఉన్నారని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ప్రీ క్వార్టర్స్ ఫైనల్స్ లో భాగంగా ఫ్రాన్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కిలియన్ అంబాపే ఏకంగా డబుల్ గోల్స్ చేసి చెలరేగిపోయాడు అని చెప్పాలి.


 కాగా ఖాతార్ వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ లో ఇప్పటికే అతను ఐదు గోల్స్ కొట్టి తిరుగులేదు అని నిరూపించాడు. గత టోర్నీలో ఏకంగా నాలుగు గోల్స్ సాధించడం గమనార్హం. దీంతో ఫిఫా వరల్డ్ కప్ లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో అర్జెంటీనా దిగ్గజం అయిన మారడోనా పోర్చుగల్ కెప్టెన్ క్రిష్టియన్ రోనాల్డో 8 గోల్స్ ను ఎంబాపే అధిగమించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అర్జెంటిన స్టార్ ప్లేయర్ అయిన లియోనల్ మెస్సి తో కలిసి సంయుక్తంగా 9 గోల్స్ తో కొనసాగుతూ ఉన్నాడు. ఇలా ఎంబాపై అరుదైన రికార్డు సృష్టించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.



 ఈ అరుదైన రికార్డుతో పాటు అటు బ్రెజిల్ ఫుడ్ బాల్ దిగ్గజం అయిన పీలే పేరిట 60 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న మరో రికార్డును సైతం ఎంబాపే బద్దలు కొట్టేసాడు అని చెప్పాలి. ఏకంగా 24 ఏళ్లలోపే ప్రపంచ కప్ టోర్నీలలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. తన కెరియర్ లో బ్రెజిల్కు మూడు ఫిఫా వరల్డ్ కప్ టైటిల్స్ అందించాడు పీలే. 24 ఏళ్లలోపే 7 గోల్స్ సాధించాడు అని చెప్పాలి. 60 ఏళ్ళ నుంచి ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేదు. కానీ ఇప్పుడు కిలియన్ అంబాపే 23 ఏళ్లకే 9 గోల్స్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: