
మరీ ముఖ్యంగా కష్టసుఖాల్లో తోడు నీడగా ఉంటామని ప్రమాణం చేసిన కట్టుకున్న వారే దారుణంగా హత మారుస్తున్న ఘటనలు చూసి నిద్రలో ఉలిక్కి పడాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంది అని చెప్పాలి. ఇటీవలే మహారాష్ట్రలో ఇలాంటి ధారణఘటన వెలుగులోకి వచ్చింది. కిరాయి హంతకుడితో చేతులు కలిపి భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. అంతటితో ఆగకుండా ఆత్మహత్యగా చిత్రీకరించెందుకు ప్రయత్నించింది. పోలీసులు తమదైన శైలిలో జరపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అకోలా లోని దహి అండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే పుండ గ్రామంలో ఇటీవల ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ పోలీసులకు సమాచారం అందింది.
ఈ క్రమంలోనే పోలీసులు ఎంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే మృతదేహం తాడుకు కట్టి ఉరి వేసుకున్నట్లుగా ఉండగా.. మృతదేహంపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో భార్యను అదుపులోకి తీసుకొని విచారించారు. కాగా భర్తను తానే చంపినట్లు అంగీకరించింది భార్య. సమీప గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి 30,000 కిరాయిని మాట్లాడి అతని సహకారంతో పధకం ప్రకారమే చంపినట్లు నిజం ఒప్పుకుంది. తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు తెలిపింది. అయితే తరచూ భర్త తాగొచ్చి తనను కొట్టేవాడని.. వేధింపులకు విసిగిపోయి ఇక హత్య పాల్పడినట్లు భార్య పోలీస్ విచారణలో తెలిపింది.