ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో టీమిండియా ఏకంగా భారీ తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే 2-1 తేడాతో సిరీస్ కూడా కైవసం చేసుకుంది. అయితే ఇక ఇలా మూడవ టి20 మ్యాచ్ జరిగి రోజులు గడుస్తూ ఉన్నాయి. కానీ ఈ మ్యాచ్లో అటు సూర్య కుమార్ యాదవ్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ గురించి మాత్రం చర్చ అస్సలు ఆగడం లేదు. ఇక క్రికెట్ ప్రేక్షకులు కూడా ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ని అస్సలు మరిచిపోవడం లేదు. మాజీ ఆటగాళ్లు అయితే సూర్యకుమార్ ఇన్నింగ్స్ ఫిదా అయ్యి ఏకంగా ప్రశంసల కురిపించకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇలా ఎంతో మంది మాజీ ఆటగాళ్లు సూర్యకుమార్ అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. మూడవ మ్యాచ్లో భాగంగా 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన సూర్య కుమార్ యాదవ్.. 51 బంతుల్లో 112 పరుగులు చేసి  టీమిండియా కు భారీ స్కోర్ అందించడంలో కీలకపాత్ర వహించాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల భారత క్రికెట్ లో వరల్డ్ కప్ వీరుడిగా కొనసాగుతున్న మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సైతం సూర్యకుమార్ పై ప్రశంసలు కురిపించాడు. తన జీవితంలో ఎంతోమంది దిగ్గజాల బ్యాటింగ్ చూసానని.. కానీ సూర్య కుమార్ లాగా షాట్లు ఆడే వాళ్ళని మాత్రం ఎప్పుడూ చూడలేదు అంటూ చెప్పుకొచ్చాడు.


 ఏకంగా తన కెరీర్లో ఏ బి డివిలియర్స్, వీవీఎస్ రీఛర్డ్స్,సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్ లాంటి ఎంతోమంది దిగ్గజాల ఆటను చూశాను. కానీ సూర్యకుమార్ లాగా సాధికారికంగా షాట్స్ కొందరు మాత్రమే ఆడగలుగుతారు. అతను క్రీజులో నిలుచుకొని మిడాన్, మీడ్ వికెట్ మీదుగా సిక్సర్లు బాధితు ఉండడం తప్పకుండా బౌలర్లలో భయాన్ని కలిగిస్తుంది. నిజంగా సూర్యకుమార్ బ్యాటింగ్ కి హాట్సాఫ్. ఇక ఇలాంటి ఆరుదైన ఆటగాళ్లు శతాబ్దానికి ఒక్కరు మాత్రమే వస్తారు అంటూ కపిల్ దేవ్ ప్రశంసలతో సూర్యకుమార్ను ఆకాశానికి ఎత్తేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: