ఈ క్రమంలోనే అటు క్వాలిఫైయర్ మ్యాచ్లు కూడా అధికారిక మ్యాచ్ లకు మించిన విధంగా ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పటికే అటు క్వాలిఫైయర్ మ్యాచ్లలో మంచి పాయింట్ల సాధించి ఇక పాయింట్లు పట్టికలో మొదటి రెండు స్థానాలలో నిలిచి వరల్డ్ కప్ కోసం అర్హత సాధించిన రెండు టీమ్స్ ఏవి అన్న విషయంపై దాదాపు క్లారిటీ వచ్చేస్తుంది. ఇటీవలే క్వాలిఫైర్ లో లీగ్ మ్యాచ్ లు ముగిసాయి. ఇటీవల ఐర్లాండ్ కు ఓదార్పు విజయం దక్కినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పటికే ఐర్లాండ్, ఒమన్ దేశాలు టోర్ని నుంచి నిష్క్రమించాయి.
ఇక స్కాట్ ల్యాండ్ పై విజయం సాధించిన శ్రీలంక మొత్తంగా నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి గ్రూప్ టాపర్ గా సూపర్ సిక్స్ లో అడుగు పెట్టింది. అదే సమయంలో ఆరు పాయింట్లతో స్కాట్లాండ్ రెండో స్థానంలో ఉంది. క్వాలిఫైయింగ్ టోర్నీలో ఇవాల్టితో లీగ్ మ్యాచ్లు ముగిసాయి. దీంతో సూపర్ 6 కు వెళ్లిన 6 జట్లలో లీగ్ దశలో సాధించిన విజయాల ఆధారంగా సాధించ పాయింట్లును ఐసీసీ పేర్కొంది ఈ క్రమంలోనే సూపర్ సిక్స్ స్టాండింగ్స్ ప్రకారం శ్రీలంక నాలుగు జింబాబ్వే నాలుగు పాయింట్లతో తొలి రెండు స్థానాలు ఉన్నాయి. తర్వాత స్కాట్లాండ్ నెదర్లాండ్ చెరో రెండు పాయింట్లతో వరుసగా మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి అని చెప్పాలి దీన్ని బట్టి చూస్తే ఇక శ్రీలంక, జింబాబ్వేలు దాదాపు వరల్డ్ కప్ కు అర్హత సాధించినట్లే అనేది తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి