భారత్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే పోటీ కూడా అదే రీతిలో ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతో మంది ఆటగాళ్లు భారత తుది జట్టులో చోటు సంపాదించుకోవాలని ఆశ పడుతూ ఉంటారు. కానీ కొంతమందికి మాత్రమే అలాంటి లక్కీ ఛాన్స్ వస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇలాంటి అదృష్టం వరించినప్పుడు ఇక తమ సత్తా ఏంటో నిరూపించుకొని జట్టులో మరిన్ని అవకాశాలు దక్కించుకునేందుకు పునాది వేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఆటగాళ్ళు మాత్రం భారత జట్టులో వచ్చిన లక్కీ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉంటారు.


 ఇటీవల కాలంలో అటు టీమ్ ఇండియాలో వచ్చిన ఛాన్స్ ని బాగా వాడుకున్న క్రికెటర్ ఎవరు అంటే తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ అని పేరు చెబుతారు అందరు. ఎందుకంటే అతను ఇటీవలే కాలంలో భారత జట్టులో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే భారత ఫ్యూచర్ స్టార్ అనే నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఇక ఇలా ఆడాడు కాబట్టే తక్కువ అనుభవం ఉన్న ఆసియా కప్ కోసం అతని ఎంపిక చేశారు. కానీ ఇటీవల  వచ్చిన లక్కీ ఛాన్స్ ను  సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఈ తెలుగు క్రికెటర్.


 ఇప్పటికే ఆసియా కప్ లో ఫైనల్లో అడుగుపెట్టింది టీమిండియా. దీంతో బెంచ్ పై ఉన్న ఆటగాళ్లకు బంగ్లాదేశ్తో మ్యాచ్లో అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే వన్ డౌన్ లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు తిలక్ వర్మ. అప్పటికే రోహిత్ శర్మ డకౌట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన తిలక్ రెండో బంతికే బీట్ అయ్యాడు. తర్వాత పిచ్ అర్థం చేసుకునే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే సెట్ అయ్యాడు అనుకునే లోపే.. తన్జీమ్ వేసిన బంతిని ఔట్ స్వింగర్ అనుకుని వదిలేసాడు. అయితే అది ఇన్స్ స్వింగ్ అవుతూ లోపలికి వచ్చింది. దీంతో బంతి కాస్త వికెట్లను గిరాటేసింది. దీంతో తిలక్ వర్మ పెవిలియన్ చేరాడు. అయితే ఒకవేళ ఈ మ్యాచ్లో రాణించి ఉంటే అటు తిలక్ వర్మకు మరిన్ని అవకాశాలు వచ్చేవి. కానీ అతను వచ్చిన ఛాన్స్ ని వినియోగించుకోలేకపోయాడు అంటూ క్రికెట్ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: