మనం 1996 వన్డే ప్రపంచకప్ నాటి సంగతులు చెప్పుకోవాలి. ఉపఖండంలో జరిగిన ఈ మెగా టోర్నీలో పాల్గొనడానికి నెదర్లాండ్స్ జట్టు మొదటిసారి భారత్‌కు రావడం జరిగింది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో కూడా చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో పెద్ద జట్లతో ఆడిన అనుభవాన్ని సంపాదించింది. ఈ జట్టులో ఉన్న టిమ్ డి లీడ్‌కు ఆ టోర్నీ మాత్రం ఓ మధుర స్మృతిగా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. అలా రోజులు గడిపోయాయి. మళ్లీ భారత్‌లో ప్రపంచకప్ వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత నెదర్లాండ్స్ భారత్‌లో అడుగుపెట్టింది. ఈసారి మరో డి లీడ్ వచ్చి పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. అతగాడు మరెవరో కాదు 1996 ప్రపంచకప్‌లో డచ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన టిమ్ డి లీడ్ తనయుడు బాస్ డి లీడ్.
అవును, హైదరాబాద్‌లో పాక్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌లో రాణించిన ఈ కుర్రాడు.. బ్యాటింగ్‌లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచి, జట్టు విజయం కోసం తుద వరకు పోరాడాడు. ఈ క్రమంలో తండ్రి బాటలో నడిచిన తనయుడిగా రికార్డుల్లోకి ఎక్కడు. 1996 ప్రపంచకప్‌తోనే టిమ్ డి లీడ్ ఆగిపోలేదు. 2003, 2007 ప్రపంచకప్పుల్లోనూ నెదర్లాండ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మరీ ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో జరిగిన 2003 ప్రపంచకప్‌లో అతడు తన ముద్ర వేశాడు. భారత్‌తో జరిగిన పోరులో టిమ్ డి లీడ్ 35 పరుగులకే 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. అంతేకాదు సచిన్ తెందుల్కర్, ద్రవిడ్ వికెట్లు పడగొట్టి ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం అనిపించుకున్నాడు.
అప్పుడు బలమైన భారత్ 204 పరుగులకే పరిమితమైందంటే టిమ్ డి లీడే కారణం అని చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్‌లో భారత్ ఎలాగోలా గట్టెక్కినా టిమ్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు వరించింది. ప్రస్తుతం టిమ్ డి లీడ్ కోచింగ్ ఇస్తున్నాడు. క్రీడా పరికరాల షాప్ నడుపుతున్నాడు. ఇన్నేళ్లకు మళ్లీ అతడి తనయుడి రూపంలో ఆ ఇంట్లో నుంచి మరో ఆటగాడు ప్రపంచకప్ ఆడడం వలన జనాలు దానిగురించే చర్చించుకుంటున్నారు. పాక్‌తో మ్యాచ్‌లో కప్ అరంగేట్రంలోనే బాస్ డి లీడ్ అదరగొట్టాడు. అప్పుడు తండ్రి మాదిరిగానే తాను కూడా 4 వికెట్లు పడగొట్టాడు. ఇంకో విశేషం ఏమిటంటే బ్యాటింగ్‌లోనూ రాణించి అర్ధసెంచరీ చేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి