అంతర్జాతీయ క్రికెట్లో ఏ మ్యాచ్ జరిగిన కూడా అది ఐసిసి నిబంధనల ప్రకారమే జరగాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ ఐసీసీ ఎలాంటి నిబంధనలు విధించిన ఆ నిబంధనలు ఉల్లంఘించడానికి ప్లేయర్లకు  ఎలాంటి అవకాశం ఉండదు. ఇక ప్లేయర్లు  నిబంధనలు పాటిస్తున్నారా లేరా అన్న విషయాన్ని కూడా అంపైర్లు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. అయితే ఇటీవల కాలంలో అధునాతనమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఉండేందుకు ఐసిసి ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్ తీసుకువస్తూ ఉంటుంది.


 ఇక ఇలాంటి రూల్స్ కారణంగా అటు నాణ్యమైన క్రికెట్ ను ప్రేక్షకులు కూడా అందించగలుగుతున్నారు  అని చెప్పాలి. అయితే క్రికెట్ లో ఎన్ని రోజుల నుంచి డిఆర్ఎస్ అనే రూల్ కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ రూల్ ప్రకారం ఒక ఆటగాడు ఎంపైర్  నిర్ణయం పై అనుమానం ఉన్నప్పుడు ఇక ప్లేయర్లు రివ్యూ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలా రివ్యూ తీసుకుంటే ఇక బాల్ ని ట్రాక్ చేసి ఇక అక్కడ జరిగిన అసలు విషయం ఏంటి అన్నది థర్డ్ అంపైర్ తేలుస్తూ ఉంటాడు.

 అయితే అధునాతన టెక్నాలజీతో రివ్యూలు తీసుకున్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఇలాంటి రివ్యూల పై అటు క్రికెటర్లు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేయడం లాంటి ఘటనలు కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. ఇక ఇటీవలే ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్  డేవిడ్ వార్నర్ సైతం డిఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ లో ఇటీవల శ్రీలంక, ఆస్ట్రేలియా తలబడ్డాయ్. ఈ మ్యాచ్ లో డిఆర్ఎస్ నిర్ణయం పై చిరాకు పడ్డ వార్నర్ డిఆర్ఎస్ లో మరింత పారదర్శకత అవసరం అంటూ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో వార్నర్ 11 రన్స్ వద్ద ఎల్బి గా అవుట్ అయినట్లు ఎంపైర్ ప్రకటించాడు. అయితే బంతి లెగ్ స్టంప్ మిస్ అయినట్లు రివ్యూ లో కనిపించిన.. తనను ఎలా అవుట్ గా ప్రకటిస్తారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు వార్నర్.

మరింత సమాచారం తెలుసుకోండి: