అలాంటి హార్దిక్ పాండ్యా ఇక వరల్డ్ కప్ లో మంచి ప్రదర్శన కనబరిచాడు. కానీ అనూహ్యంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గాయం బారిన పడ్డాడు. అయితే చీలమండ గాయం బారిన పడిన అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే వరల్డ్ కప్ లో తదుపరి మ్యాచ్ లోకి అతను అందుబాటులో ఉంటాడని అనుకున్నప్పటికీ.. వరల్డ్ కప్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఫేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ కావడంతో అతను జట్టులోకి దూరం కావడంతో.. మహమ్మద్ షమీ సూర్య కుమార్ లాంటి ఇద్దరు ప్లేయర్లతో అతని స్థానాన్ని భర్తీ చేయాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు హార్దిక్ పాండ్యా గాయం గురించి.. ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. చీలమండ గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా.. కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే వరల్డ్ కప్ టోర్నీ మొత్తానికి దూరమైన అతను ఆస్ట్రేలియా తో జరగబోయే ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ కి కూడా అందుబాటులో ఉండడం కష్టమేనట. ముందుగా అనుకున్న ప్రకారం రోహిత్ కు విశ్రాంతి ఇచ్చి హార్దిక్కు ఆస్ట్రేలియా తో సిరీస్ కోసం కెప్టెన్సీ ఇవ్వాలని బీసీసీఐ అనుకుంది. కానీ హార్దిక్ కూడా గాయంతో దూరం కావడంతో సూర్యకుమార్ లేదా రూతురాజ్ లకు కెప్టెన్సీ అప్పగించ ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి