అతి కష్టం మీద అటు సెమి ఫైనల్లో అడుగుపెట్టింది. కానీ అటు పాత గణాంకాలు చూసుకుంటే మాత్రం భారత జట్టు పై న్యూజిలాండ్ దే పైచేయిగా కొనసాగుతుంది. 2019 వరల్డ్ కప్ సెమి ఫైనల్ లోను ఏకంగా న్యూజిలాండ్ జట్టు భారత్ ను ఓడించింది అని చెప్పాలి. దీంతో ఇప్పుడు ఏం జరగబోతుంది అనే విషయం పైన అందరిలో కూడా ఆత్రుత ఉంది. అయితే ఇక న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కోసం ఇక కొన్ని పాత సెంటిమెంట్లను కూడా బాగా నమ్ముతున్నారు టీమిండియా అభిమానులు. ఈ క్రమంలోనే భారత జట్టుకు అస్సలు కలిసి రాని అంపైర్గా కొనసాగుతున్న ఒక ఐరన్ లెగ్ రిఫరీ మాత్రం ప్రస్తుతం సెమీఫైనల్కు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
భారత జట్టు విషయంలో ఐరన్ లెగ్ అనే పేరును తెచ్చుకున్నాడు అంపైర్ రిచర్డ్ షటిల్ బరో. 2019 వరల్డ్ కప్ సెమి ఫైనల్లో భారత్ ఓటమి నుంచి ఆయన ట్రెండింగ్ లోకి వచ్చారు. అయితే ఈసారి భారత్, న్యూజిలాండ్ మధ్య మరోసారి సెమీఫైనల్ లో మ్యాచ్ జరుగుతుంది. అయితే రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేయడం లేదు. దీంతో అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆన్ ఫీల్డ్ ఎంపైర్గా రిచర్డ్ ఎల్లింగ్ వర్త్, రాడ్ టక్కర్.. థర్డ్ అంపైర్గా జోయల్ విల్సన్ భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ ను పర్యవేక్షించబోతున్నారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి