అయితే ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న 2023 వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు ఎంత అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి మ్యాచ్ నుంచి దూకుడు చూపిస్తున్న టీమిండియా.. లీగ్ దశలో జరిగిన తొమ్మిది మ్యాచ్ లలో అన్నింట విజయం సాధించింది. ఇక ఇటీవల సెమీఫైనల్ మ్యాచ్లో కూడా గెలిచి ఫైనల్లో అడుగు పెట్టింది. ఇక టీమిండియా దూకుడు చూస్తుంటే.. ఈసారి టైటిల్ గెలవడం ఖాయం అన్నది మాత్రం ప్రతి ఒక్కరి అంచనా. అదే సమయంలో టీమిండియా తప్పకుండా టైటిల్ గెలుస్తుంది అంటూ కొన్ని పాత సెంటిమెంట్లు కూడా తెరమీదకి వస్తున్నాయి.
అయితే టీమిండియా ఈసారి కప్పు గెలవడం ఖాయం అంటూ మరో కొత్త సెంటిమెంట్ తెరమీదకి వచ్చింది. 2003 వరల్డ్ కప్ నాటి రికార్డులు కలిసి వస్తే టీమిండియా.. విశ్వవిజేతగా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఆ టోర్నీలో ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరకముందు ఆసిస్ 10, ఇండియా 8 మ్యాచ్లలో విజయం సాధించాయి. 2023 వరల్డ్ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా తన మూడవ వరల్డ్ కప్ టైటిల్ సొంతం చేసుకుంది. అయితే 20 ఏళ్ల తర్వాత ఇరు జట్లు మరోసారి ఫైనల్ తలబడుతున్నాయి. ఈసారి ఇండియా ఫైనల్ కు చేరకముందు 10, ఆస్ట్రేలియా ఎనిమిది మ్యాచ్లలో విజయం సాధించాయి. అదే సమయంలో టీమిండియాకు గెలిస్తే ఇది మూడో వరల్డ్ కప్ ట్రోఫీ జరుగుతుంది. దీంతో ఈ గణాంకాలను బట్టి టీమిండియా తప్పక టైటిల్ గెలుస్తుందని అందరూ భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి