వరల్డ్ క్రికెట్ కి నయా మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ ఎవరు అంటే  అందరూ సూర్య కుమార్ యాదవ్ పేరు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు డివిలియర్స్  ఎలా అయితే మైదానం నలవైపులా షాట్లు ఆడుతూ అందరిని ఆశ్చర్యపరిచాడో.. ఇక ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్ సైతం అలాంటి ఆట తీరుతోనే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టినీ తన వైపుకు తిప్పుకున్నాడు. బౌలర్లకు ముచ్చెమటలు పట్టించే విధంగా మైదానం నలువైపులా కూడా ఎంతో అలవోకగా షాట్లు వాడుతూ తనకు తిరుగులేదు అని నిరూపించాడు సూర్య కుమార్ యాదవ్.


 అయితే మొన్నటి వరకు వన్డే ఫార్మాట్లో ఛాన్స్ లు దక్కించుకున్నప్పటికీ పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయిన ఈ బ్యాట్స్మెన్.. అటు టి20 ఫార్మాట్లో మాత్రం మరోసారి విధ్వంసకరమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక గత కొంతకాలం నుంచి అటు భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అందుకునీ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. మొన్నటికి మొన్న సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్లో ఆటగాడిగా కెప్టెన్ గా కూడా అదరగొట్టేసాడు.


 ఇక ఇప్పుడు భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక అక్కడ ఆతిథ్య సఫారీ టీం తో టి20 సిరీస్ ఆడుతుంది భారత జట్టు. అయితే మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా ఇటీవల రెండో మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అటు భారత జట్టు ఓడిపోయినప్పటికీ కెప్టెన్గా వ్యవహరించిన సూర్య కుమార్ యాదవ్ మాత్రం ఒక రికార్డు నెలకొల్పాడు. సౌత్ ఆఫ్రికాలో ఆ జట్టుపై టి20 ఫార్మాట్లో అర్థ సెంచరీ చేసిన ఏకైక భారత కెప్టెన్ గా సూర్యకుమార్ నిలిచాడు. ఇటీవల జరిగిన మ్యాచ్లో సూర్య 55 పరుగులతో రాణించాడు. ఇక అతని తర్వాత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని చేసిన 45 పరుగులు అత్యధిక స్కోర్ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: