స్టార్ బౌలర్ బుమ్రాకు విశ్రాంతి ప్రకటించిన నేపథ్యంలో ఇక అతని స్థానంలో ఆకాష్ దీప్ కి జట్టులో అవకాశం కల్పించారు సెలెక్టర్లు. ఈ క్రమంలోనే అనూహ్యంగా ఈ ప్లేయర్ ను ఎంపిక చేయడంపై చర్చ కూడా జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే అప్పటివరకు ఐపిఎల్ లో గాని దేశావాళి క్రికెట్లో గాని పెద్దగా చెప్పుకోదగ్గ రికార్డులు సాధించని ఆకాష్ దీప్ ఇక టీమిండియా తరఫున ఎలా రాణిస్తాడు అనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల రాంచి వేదికగా మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటిరోజు ఆటలో అదరగొట్టేసాడు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలోనే ఇక తన అరంగేట్ర మ్యాచ్ లోనే ఆకాష్ దీప్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. తొలిరోజే ఏకంగా ఇంగ్లాండ్ పై మూడు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టేశాడు. ఈ క్రమంలోనే అతనిపై అందరూ ప్రశంసలు కూడా కురిపించారు అని చెప్పాలి. అయితే తన ప్రదర్శన గురించి మాట్లాడిన ఆకాష్ దీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక మొదటి మ్యాచ్లో తన ప్రదర్శనను తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. తాను ఎప్పుడు గొప్ప ప్రదర్శన చేయాలని తన తండ్రి కోరుకునే వాడు అంటూ ఆకాష్ చెప్పుకొచ్చాడు. కానీ ఆయన బ్రతికున్నప్పుడు ఏమీ చేయలేకపోయాను అంటూ తెలిపాడు. ఇక బౌలింగ్లో బుమ్రా సలహాలు తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ఆకాష్ దీప్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి