ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో టెస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్ హనుమ విహారి వ్యవహారం కాస్త సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైందని.. ఏకంగా ఒక రాజకీయ నాయకుడి కొడుకును మందలించారు అనే అక్కస్సుతో తనను కెప్టెన్సీ నుంచి తప్పించారు అంటూ హనుమ విహారి ఆరోపించాడు. ఎన్నో ఏళ్ల పాటు ఆంధ్ర జట్టును సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించిన తనకు ఇదేనా మీరిచ్చే గౌరవం అంటూ ప్రశ్నించాడు.


 ఒక కుర్ర ఆటగాడికి ఇచ్చిన ప్రాధాన్యత సీనియర్ అయిన తనకు ఇవ్వలేదని ఇది ఎంతో అవమానకరంగా అనిపించింది అంటూ సంశలన ఆరోపణలు చేశాడు హనుమ విహారి. అయితే ఇక ఈ తెలుగు క్రికెటర్ చేసిన కామెంట్స్ కాస్త సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి. అయితే హనుమ విహారి కామెంట్స్ పై స్పందించిన కేఎన్ పృథ్వీరాజ్ అనే వికెట్ కీపర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మీరు వెతుకుతున్న క్రికెటర్ నేనే. అతడు చెప్పింది అబద్ధం. నాపై అసభ్య పదజాలం వాడింది నిజం. ఆరోజు ఏం జరిగిందో టీం లోని సభ్యులందరికీ తెలుసు అంటూ పృథ్వీరాజ్ అనే యంగ్ క్రికెటర్ కామెంట్ చేశాడు. నువ్వు ఇలా సింపతి గేమ్స్ ఆడటం తప్ప.. ఇంతకుమించి ఏమీ పీకలేవు మిస్టర్ సో కాల్డ్ ఛాంపియన్ అంటూ ఇక పృథ్వీరాజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ గా మారిపోయాయి. అయితే పృథ్వీరాజ్ ఏపీలోని అధికార పార్టీకి చెందిన ఒక కార్పొరేటర్ కొడుకు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వివాదం గురించి ఇక సదరు రాజకీయ నాయకుడు ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం. అయితే ఇక ఆంధ్ర క్రికెట్లో రాజకీయ జోక్యం ఉంది అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. బీసీసీఐ స్పందించి చర్యలు చేపట్టాలి అంటూ పలువురు క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. ఏం జరుగుతుందో చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: