ఇండియన్ క్రికెట్లో యువ ఆటగాడు శుభమన్ గిల్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా గిల్ ను భారత క్రికెట్కు యువరాజు అని పిలుచుకుంటూ ఉంటారు అందరు. కింగ్ కోహ్లీకి గిల్ వారసుడు అంటూ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అందరూ యువ ఆటగాళ్ల లాగానే అతను కూడా భారత జట్టులోకి వచ్చినప్పటికీ.. అతని అద్భుతమైన ఆట తీరుతో జట్టులో తక్కువ సమయంలోనే స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఏకంగా సీనియర్లను సైతం తప్పించి గిల్ ను ఓపెన్అర్ గా కొనసాగించే విధంగా సత్తా చాటుతున్నాడు. అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ లో కూడా అదరగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి.


 హార్థిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత గిల్ కు అనుకొని అదృష్టం వరించింది. ఏకంగా చిన్న వయసులోనే ఐపీఎల్లో ఒక టీం కి కెప్టెన్సీ వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు  అప్పటికే హార్దిక్ కెప్టెన్సీలో ఒకసారి టైటిల్ విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ను సారధిగా ముందుకు నడిపించే అవకాశాన్ని దక్కించుకున్నాడు గిల్. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో సమర్థవంతంగా గుజరాత్ ను  ముందుకు నడిపిస్తూ తన కెప్టెన్సీ నైపుణ్యంతో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన గిల్ ఇక ఇటీవలే ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో మరో అరుదైన రికార్డు సృష్టించాడు.


 అతి తక్కువ ఇన్నింగ్స్ లోనే మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండవ భారత ప్లేయర్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 80 మ్యాచుల్లో ఈ ఘనత సాధిస్తే.  94 ఇన్నింగ్స్ లో ఐపీఎల్ టోర్నీలో 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు గిల్. అంతేకాదు 3000 పరుగులు పూర్తి చేసుకున్న పిన్న వయస్కుడిగా కూడా నిలిచాడు. 24 ఏళ్ల 215 రోజుల వయసులోనే గిల్ ఈ ఘనతను సాధించడం గమనార్హం. విరాట్ కోహ్లీ 26 ఏళ్ల 165 రోజులు వయసులోనే ఈ మార్కును అందుకున్నాడు . కాగా ఈ ఐపిఎల్ సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన గుజరాత్ టైటాన్స్ జట్టు మూడు విజయాలు సాధించి పాయింట్లు పట్టికలో ఆరవ స్థానంలో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl