ప్రస్తుతం భారత క్రికెట్ లో ఎక్కడ చూసిన ఒకే విషయంపై చర్చ జరుగుతుంది. అదే ఇటీవల భారత జట్టు సెలెక్టర్లు జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టు గురించి.  తప్పకుండా చోటు సంపాదించుకుంటారు అనుకున్న కొంతమంది ఆటగాళ్ళకు వరల్డ్ కప్ టీంలో చోటు దక్కలేదు. అదే సమయంలో పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న కొంతమంది ప్లేయర్లకు మాత్రం ఏకంగా వరల్డ్ కప్ టీంలోకి సెలక్టర్లు తీసుకోవడం చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే గత ఏడాది ఐపీఎల్ నుంచి కూడా అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న రింకూ సింగ్ తప్పకుండా ఈసారి వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకుంటాడు అని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు.


 కానీ ఊహించని రీతిలో అటు సెలెక్టర్లు మాత్రం రింకు సింగ్ విషయంలో కాస్త మొండిగానే వ్యవహరించారు. గత ఐపీఎల్ లో బాగా రానించి ఆ తర్వాత టీమ్ ఇండియా తరపున కూడా మెరుపు ఇన్నింగ్స్ లు ఆడి ఆకట్టుకున్న రింకు సింగ్  ఇక ఇప్పుడు ఐపీఎల్ లో కూడా అదరగొడుతున్నారు. దీంతో అతనికి తప్పకుండా జట్టులో చోటు దక్కుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఊహించని రీతిలో కేవలం రిజర్వ్డ్  ప్లేయర్ల లిస్టులో అతని చేర్చారు సెలక్టర్లు. ఇక ఈ విషయంపై ఇప్పటికే ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రింకు వరల్డ్ కప్ కి ఎంపిక కాకపోవడం పై అతని తల్లిదండ్రులు కూడా స్పందించారు.



 టి20 వరల్డ్ కప్ లో రింకు చోటు దక్కకపోవడంతో అతని తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురి అయ్యారు. తుది జట్టులో కొడుకుకి చోటు ఖాయం అనుకుని వారు టీం ప్రకటించిన వెంటనే సంబరాలు చేసుకునేందుకు క్రాకర్స్ కూడా తెచ్చి పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత వరల్డ్ కప్ కి ఎంపిక చేసిన జట్టులో తాను లేనని.. రింకు సింగ్ తల్లికి ఫోన్ చేసి చెప్పడంతో మా గుండె బద్దలైంది అంటూ చెప్పుకొచ్చాడు రింకు సింగ్ తండ్రి ఖాన్ చంద్ర. అయితే ఈనెల 25 వరకు జట్టులో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉండడంతో.. రింకు కి వరల్డ్ కప్ జట్టులో ఛాన్స్ దొరికే అవకాశం ఉంది అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: