ఇక అసలు విషయంలోకి వెళితే, టాస్ గెలుచుకున్న రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకోవడం అనే అంశంపై సర్వత్ర ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే అందులోని పెద్ద విషయం ఏముందని అనుకుంటున్నారా? గణాంకాలను బట్టి పరీక్షిస్తే, సొంత గడ్డపై టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోవడం ఇది రెండోసారి కావడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సరిగ్గా తొమ్మిది సంవత్సరాల తర్వాత స్వదేశంలో టెస్ట్ మ్యాచెస్ విషయంలో ఇది అరుదుగా జరిగింది అని విశ్లేషకులు అంటున్నారు. బెంగళూరు వేదికగా 2015 వ సంవత్సరంలో అప్పటి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇదే మాదిరి, టాస్ గెలుచుకొని మరి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఇలా టెస్ట్ మ్యాచ్లో జరగడం రెండోసారి కావడం ఒక రికార్డు గానే పరిగణించవచ్చు.
ఇక రోహిత్ శర్మ వర్షం కారణంగా మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నట్టు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇది తెలివైన ఎంపిక అని క్రీడా విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. మేఘావృతమైన వాతావరణాన్ని పసిగట్టిన రోహిత్ శర్మ చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడంలో, బంగ్లాదేశ్ ఆటగాళ్లు 35 ఓవర్లకు గాను కేవలం 107 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. అయితే ఇదే మాదిరి, అతను బంగ్లాదేశ్ కూడా టాస్ గెలుచుకొని మరి, ఫీల్డింగ్ ఎంచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఇలాగే ఫీల్డింగ్ ఎంచుకుంది. అదేవిధంగా 1997లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్, శ్రీలంక దేశాలు కూడా ఇదే మాదిరిగా మొదట టాస్ గెలుచుకొని, ఫీల్డింగు ఎంచుకున్నాయి.