
ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ క్రికెటర్ బాలీవుడ్ ప్రముఖ నటి అనుష్క శర్మను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి ప్రస్తుతం ఓ కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో క్యూట్ కపుల్స్ లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంట ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విరాట్ కోహ్లీ మ్యాచ్లు ఆడే సమయంలో చాలా సార్లు అనుష్క శర్మ స్టేడియంకు వచ్చి విరాట్ కోహ్లీని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట ఏం చేసినా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారుతాయి.