నిన్న బెంగళూరులో చిన్న స్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిస్లాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది . ఇప్పుడు ఎక్కడ చూసినా సరే చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట గురించే జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 ట్రోఫీని అందుకోవడం కేవలం ఆ జట్టు మెంబర్స్ కే కాదు యావత్ కర్ణాటక దేశం మొత్తం సంబరాలు చేసుకునేలా చేసింది.  అయితే పరేడ్ నిర్వహించాలి అంటూ ఆర్ సి బి మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం ఊహించని విధంగా చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగేలా చేసింది .
 

భారీ సంఖ్యలో జనాలు  తరలిరావడం అభిమానులు ఒకరిపై ఒకరు పడడం ..పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అన్ని గేట్స్ ను ఒకేసారి ఓపెన్ చేయడంతో భారీ తొక్కిసలాట జరిగింది . 11 మంది మరణించారు . ఈ ఘటనలో దాదాపు 35 మంది తీవ్రంగా గాయపడ్డారు . మరి కొంతమంది స్వల్పంగా గాయపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు . విజయవత్సవం సందర్భంగా ఏర్పడ్డ భద్రతా లోపాల వల్లే ఈ 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోవడం చాలా చాలా దారుణం అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్టులు పెడుతున్నారు.


 అయితే ఇది కేవలం ఒక ట్రాజడీ మాత్రమే కాదు దేశంలో ఇలాంటివి గతంలో కూడా జరిగాయి.  దేశంలో పెద్ద సంఖ్యలో ప్రాణానిష్టం కలిగించిన అతి పెద్ద క్రీడా ప్రజా సమూహ ఘటనల సరళలో ఇది కూడా స్థానం సంపాదించింది . ఫాన్స్ అత్యుత్సాహం ప్రాణహానికి దారి తీయడం పట్ల సర్వత్ర ఆవేదన వ్యక్తం అవుతుంది . మరీ ముఖ్యంగా కోల్కత్తా ఈడెన్ గార్డెన్ స్టేడియం లో జరిగిన ఘటనను మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు . ఈ ఘటన దేశ చరిత్రలోనే ఎప్పుడు మర్చిపోలేని దుర్ఘటనగా అందరూ గుర్తుపెట్టుకున్నారు .

1980 ఆగస్టు 16న కోల్కత్తా ఈడెన్ గార్డెన్ స్టేడియంలో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా రెండు జట్ల అభిమానుల మధ్య జరిగిన గొడవ ఎప్పటికీ మర్చిపోలేనిది . ఈ గొడవలో తోపులాటలో దాదాపు 16 మంది మరణించడం అప్పట్లో దేశాన్ని శోకసంద్రంలో ముంచేసింది . అంతేకాదు  ఈ ఘటన ఇండియన్ స్పోర్ట్స్ హిస్టరీ లోనే అత్యంత విషాదకర ఘటనగా నమోదయింది . 1969 లో ఆస్ట్రేలియా ఇండియా టెస్ట్ మ్యాచ్ టికెట్ల కోసం ఎదురైన తొక్కిసలాటలో  దాదాపు 6 మంది మృతి చెందడం ఇంకొక ఉదాహరణ. ఇవన్నీ భద్రతా లోపాల వల్లే జరుగుతున్నాయి అంటూ మాట్లాడుతున్నారు జనాలు.



కానీ ఫ్యాన్స్ కూడా హద్దులు మీరకూడదు అని ఎవరి స్థాయిలో వాళ్ళు ఉండాలి అని హద్దులు మీరిన అభిమానం ఎప్పుడు డేంజర్ అంటూ గుర్తు చేస్తున్నారు.  ప్రతిసారి ఈ తరహా ఘటనల తర్వాత మాత్రమే స్పందించడం కాదు ముందు జాగ్రత్త చర్యలతో పాటు ప్రాణాలను కాపాడే విధంగా ప్లానింగ్ ఉండాలి లేదంటే అభిమానుల అత్యుత్సాహం ఒక్కొక్క విషాదానికి దారితీస్తూనే ఉంటుంది అంటూ కామన్ పీపుల్స్ ఫైర్ అవుతున్నారు.  గవర్నమెంట్ తగిన విధంగా సెక్యూరిటీ కల్పించాలి అంటూ మాట్లాడుతున్నారు .ప్రభుత్వాలు-  నిర్వాహకులు - భద్రత వ్యవస్థలు - క్రీడ వినోద కార్యక్రమాలను సజావుగా నడిపించాలి అంటే కొన్ని కొన్ని భద్రతపై అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విధంగా జనాలు మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: