టీమ్ ఇండియా క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు అయినటు వంటి వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సెహ్వాగ్ ఇండియా క్రికెట్ జట్టు లో ఎన్నో అంతర్జాతీయ మ్యాచులను ఆడి ఇండియాకు ఎన్నో విజయాలను అందించడంలో అత్యంత కీలక పాత్రను పోషించాడు. ఇకపోతే సెహ్వాగ్ 2015 వ సంవత్సరం క్రికెట్ ఆటకి రిటైర్మెంట్ ఇచ్చాడు. తాజాగా సెహ్వాగ్ టాలీవుడ్ ప్రో లీగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సెహ్వాగ్ టాలీవుడ్ హీరోల గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. అలాగే తనకు తెలుగు సినిమా పరిశ్రమలో ఫేవరెట్ నటుడు ఎవరు ..? ఎవరి సినిమాలను ఆయన ఎక్కువగా చూస్తున్నాడు అనే విషయాలను కూడా సెహ్వాగ్ తాజాగా క్లియర్ గా చెప్పుకొచ్చాడు.

తాజాగా సెహ్వాగ్ మాట్లాడుతూ ... నాకు తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. నాకు తెలుగు , తమిళ్ భాషలు పెద్దగా రావు. కానీ హిందీ లో డబ్ అయినా చాలా తెలుగు సినిమాలను నేను చూశాను. అందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కు సంబంధించిన సినిమాలను కూడా నేను బాగా చూశాను. ఇక టాలీవుడ్ నటుడు అయినటువంటి అల్లు అర్జున్ కూడా అద్భుతంగా నటిస్తూ ఉంటాడు. ఆయన నటన కూడా నాకు చాలా ఇష్టం. ఆయన నటించిన పుష్ప పార్ట్ 1 , పుష్ప పార్ట్ 2 మూవీలను నేను మూడు సార్లు చూశాను. ఇక ప్రభాస్ హీరో గా రూపొందిన బాహుబలి సినిమాలను కూడా నేను చూశాను. నాకు రిటైర్మెంట్ తర్వాత పెద్దగా పని ఏమీ లేదు. దానితో అనేక సినిమాలో చూస్తూ వస్తున్నాను. అందులో భాగంగా తెలుగు డబ్బింగ్ సినిమాలను కూడా బాగా చూస్తున్నాను అని సెహ్వాగ్ తాజా కార్యక్రమంలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: