లోకనాయకుడు కమల్ హాసన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి సభ్యులను పలకరించాడు... తెలుగులో బిగ్ బాస్ షో కి అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తుంటే.... తమిళంలో బిగ్ బాస్ కు హోస్ట్ గా కమలహాసన్ వ్యవహరిస్తున్నారు. శనివారం కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా... ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేసింది బిగ్ బాస్ బృందం. కమల్ హాసన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి సభ్యులకు పరిచయం చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది, అలాగే కొన్ని కొన్ని ఆసక్తికరమైన గేమ్స్ ఆడించి సందడి చేశారు.