సినీ పరిశ్రమలో బ్రేక్ అప్ లు సహజం.. వాస్తవానికి బ్రేక్ అప్ తర్వాత ఆ జంట ఎవరి పనులు వారు ఎవరి లైఫ్ వారు చూసుకుని వారి వారి పనులు చేసుకుంటుంటారు.. అయితే బాలీవుడ్ లో యాక్టర్ మాత్రం తన మాజీ లవర్ మీద కక్ష్య పెట్టుకుని ఆమెపై లైంగిక దాడికి దిగాడు. ఇంతకీ ఆ ప్రబుద్దుడు ఎవరంటే స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాలో చేసిన నటుడు మధుర్ మిట్టల్ గుర్తుండే ఉండి ఉంటారు. ఆయనకు ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆయనపై ముంబై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేసారు.