బిగ్ బాస్.. 'స్టార్ మా'లో ప్రసారం అయ్యే ఈ రియాలిటీ షో ఇప్పటికి మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇంకా ఇప్పుడు త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కానుందని స్టార్‌ మా అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు బిగ్‌బాస్‌ లోగోతో కూడిన ప్రోమోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

 

అయితే ఇన్నాళ్లు ఈ రియాలిటీ షో కి సంబంధించి గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమయ్యే అవకాశం లేదని ప్రచారం జరిగింది. ఇంకా ఇప్పుడు ఆ ప్రచారంకు చెక్ పెడుతూ బిగ్ బాస్ సీజన్ 4 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారక ప్రకటన చేశారు.  

 

 

బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమవుతుందని స్టార్ మా క్లారిటీ ఇవ్వడంతో ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్‌లపై వార్తలు బాగానే హాల్ చల్ చేస్తున్నాయి. ప్రేక్షకులు మరిచిపోయిన సెలబ్రెటీలను ఈ షోలో తీసుకురానున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకా కంటెస్టెంట్ల ది ఒక ఎత్తు అయితే హోస్ట్‌ ది మరో ఎత్తు. హోస్ట్ గా ఎవరు చెయ్యనున్నారు అనేదానిపై ఆసక్తి నెలకొంది. 

 

కాగా బిగ్ బాస్ మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాగా శివ బాలాజీ విజేతగా నిలిచాడు. రెండొవ సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించగా కౌశల్ మంద టైటిల్ విన్ అయ్యాడు. ఇంకా ఎన్నో వివాదాల మధ్య ప్రారంభమైన సీజన్ 3కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలుచుకున్నాడు. మరి సీజన్ 4లో కంటెస్టెంట్ లు ఎవరు? హోస్ట్ ఎవరు అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఓపిక పట్టక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: