తెలుగు టెలివిజన్, సినిమాలలో తనదైన స్టైల్ తో ఎంతోమందిని ఆకట్టుకుంటున్న తెలుగు టాప్ యాంకర్ రష్మి గౌతమ్... ఇప్పుడు సరికొత్త ప్రోగ్రాం తో దర్శనం ఇవ్వబోతోంది. ఇప్పటి వరకు అనేక కామెడీ డాన్స్ షో లలో యాంకరింగ్ చేసిన రష్మీ, తాజాగా క్రీడాకారుల జీవితాలని స్ఫూర్తిని ఇచ్చే కార్యక్రమాన్ని రూపొందించబోతోంది. అతి త్వరలో ఈ ప్రోగ్రాం ని ముందుకు తీసుకురాపోతున్నారు. ఈ ప్రోగ్రాం సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి చూస్తే....



టాప్ యాంకర్ గా కొనసాగుతున్న రష్మి గౌతమ్ ఇప్పటివరకు తెలుగు టెలివిజన్ పై తన గ్లామర్ తో మాత్రమే ఆకట్టుకుందని చెప్పవచ్చు. జబర్దస్త్ లో తన గ్లామర్ తో, అలాగే డీ షో లో సుధీర్ తో తన కెమిస్ట్రీ , హాస్యాన్ని పండిస్తూ షోలను నటిస్తోంది. అయితే ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఇటు వినోద రంగంలో మరోవైపు క్రీడారంగంలో పని చేయబోతున్న తొలి యాంకర్ గా రష్మి గౌతమ్ రికార్డు సృష్టించబోతోంది. తెలుగు టెలివిజన్ రంగంలో స్టార్ స్పోర్ట్స్ 1 ద్వారా విభిన్నమైన షో కు శ్రీకారం చుట్టేందుకు రేష్మి సిద్ధమవుతోంది. మహిళా శక్తిని, బాలికల ఔదార్యం చాటిచెప్పే విధంగా సరిలేరు మీకెవ్వరు అనే కార్యక్రమం ద్వారా ముందుకు రాబోతోంది రష్మి గౌతమ్. ఈ కార్యక్రమంలో క్రీడా రంగంలో గొప్ప రికార్డులను చరిత్ర సృష్టించిన మహిళా క్రీడాకారులను వారి మనోభావాలను తెలుసుకుని వారి జీవిత ఆశయాలను తెలిపేలా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు రష్మి.


ఇందుకు సంబంధించి దేర్ ఈజ్ నో మ్యాచ్ ఫర్ ఆజ్ టైటిల్ తో స్పోర్ట్స్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రష్మి. ముఖ్యంగా మహిళలు వారి రాష్ట్రానికి, అలాగే దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చి ఎందరో జీవితాలని ప్రభావితం చేసేలా ఉండే వారిని ఇంటర్వ్యూ చేయడం చేయబోతోంది రష్మీ. ఈ కార్యక్రమం కోసం మొట్టమొదటిగా టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ని పరిచయం చేయబోతున్నారు నిర్వాహకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: