గతంలో సీజన్ ఎండింగ్ సమయంలో రిజల్ట్ తెలిపి ఫైనల్ విన్నర్ ఎవరో చెప్పేందుకు బిగ్ సెలబ్రిటీలను గెస్ట్ గా పిలిచేవాళ్ళు. అయితే ఈసారి సీజన్ కి గ్రాండ్ వెల్ కమ్ చెప్పడానికి మెగా గిఫ్ట్ రెడీ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సీజన్ 5 ఫస్ట్ ఎపిసోడ్ లో గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు నాగ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా రాబోతున్నట్లు సమాచారం. బిగ్ బాస్ షోను ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఈ విధంగా సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ వార్త నిజమేనా బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ ఎపిసోడ్ లో స్టేజ్ పై నాగ్ తో కలసి మెగాస్టార్ కనిపిస్తారా లేదా అన్నది తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు
అయితే దీనిపై అటు మా యాజమాన్యం కానీ చిరు కానీ క్లారిటీ ఇవ్వలేదు. కాగా సీజన్ 5 లో కంటెస్టెంట్ లు వీరే అంటూ కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరి అవన్నీ నిజమా కదా అని తెలియాలన్నా కూడా మా యాజమాన్యం నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండక తప్పదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి