కొందరికి ఇది మంచి ఎంటర్టైనింగ్ గా అనిపించినా చాలా మందికి మాత్రం ఏంటి ఈ గోల అనేలా కనిపించింది. మొత్తానికి హమీదా హౌజ్ నుండి ఎలిమినేట్ అవ్వడంతో బాగా డల్ అయిపోయాడు. దాంతో రామ్ అభిమానులు తలలు పట్టుకున్నారు. మళ్ళీ ఎలాగోలా సెట్ రైట్ అయిపోయి అసలు గేమ్ ను అడటం మొదలెట్టాడు ఈ గాయకుడు. ఇంకేముంది తిరిగి అతడి ఫ్యాన్స్ ముఖంలో కొత్త వెలుగులు కనిపించాయి. చిన్న చిన్న వివాదాలు, సపోర్టింగ్, పోటీతత్వం ఇలా గేమ్ కి కావలసిన దాదాపు అన్ని యాంగిల్ ను కనబరుస్తున్నారు. కానీ టైటిల్ కొట్టాలంటే మాత్రం రామ్ ఇంకా తనని తాను మార్చుకోవాలి అంటున్న నెటిజన్ల అభిప్రాయాలు ఇపుడు చూద్దాం.
టాస్క్ ల సమయంలో మానస్, సన్నిల పైన మాత్రమే ఫోకస్ పెట్టడం పక్కన పెట్టి అందరి పోటీదారులను సమానంగా చూస్తూ తాను నెగ్గడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇక కొన్ని సార్లు తను ఇతరులను వారి వీక్ పాయింట్ ను టార్గెట్ చేసి మరీ చాలా సిల్లీగా మాట్లాడుతూ వారికి ఆగ్రహం తెప్పించేలా చేయడం చూసే వారికి చాలా సిల్లీగా అనిపిస్తుంది. ముఖ్యంగా రామ్.. సన్నీని కావాలని రెచ్చగొడుతున్నారు అన్న మాటలు బయట గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక్కడ సన్ని కి ప్లస్ అవుతుంటే రామ్ కి మైనస్ అవుతున్నాయి. ఇక ఇవి తప్ప మిగిలిందంతా పర్ఫెక్ట్ గా ఉందని..కొన్ని మార్పులు చేసుకుంటే శ్రీ రామ్ సీజన్ 5 టైటిల్ దక్కించుకోవడం ఖాయం అని అంటున్నారు కొందరు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి