బుల్లితెరపై ఫిమేల్ యాంకర్ గా గ్లామర్ బ్యూటీ గా పేరుపొందింది యాంకర్ శ్రీముఖి ఇక ఈమె పలు సినిమాలలో హీరోయిన్ గా, సైడ్ క్యారెక్టర్ గా కూడా నటించింది. ఇక తన మాటలతో, అల్లరితో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది ఈ ముద్దుగుమ్మ ఇక బుల్లితెరపై రాములమ్మగా కూడా పేరుపొందింది.వెండితెర పైన బుల్లితెర పైన కూడా నటిస్తు బాగా ఆకట్టుకుంటూ ఉన్నది. ఇక అంతేకాకుండా బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చి మరింత మంది ప్రేక్షకులను సంపాదించింది.


ఇక శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా వినిపిస్తున్నా విషయం ఏమిటంటే శ్రీముఖికి జబర్దస్త్ లో యాంకర్ గా అవకాశం వచ్చిన ఈమె ఎందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. అందుకు గల కారణం ఏంటా అని ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇక జబర్దస్త్ షో మాత్రం దాదాపుగా 8 ఏళ్ల నుండి ప్రసారమవుతూ ఉన్నది ఈ షో లో చేసిన వారికి మంచి ఆదరణ లభిస్తూ ఉంటుందని చెప్పవచ్చు రేటింగ్ విషయంలో కూడా టాప్ పోసిషన్ లోనే ఉండేది.. కానీ ఈ మధ్యకాలంలో కాస్త రేటింగ్ బాగా తగ్గిపోయిందని చెప్పవచ్చు.


అందుకు కారణం కొంతమంది కమెడియన్లు బయటికి వెళ్లడమే అంతేకాకుండా యాంకర్ అనసూయ కూడా ఇందులో నుంచి వెళ్ళిపోవడంతో ఈ షో కాస్త డీల పడినట్లుగా తెలుస్తోంది. ఇక అనసూయ గ్లామర్ ఈ షో కి బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు దీంతో అనసూయ వెళ్లిపోవడంతో.. ఈ షో నిర్వాహకులు శ్రీముఖిని అడగక ఆమె ఒప్పుకోలేదని తెలుస్తోంది దీంతో రష్మీనే యాంకర్ గా మళ్లీ జబర్దస్త్ లోకి ఇచ్చారు. అయితే శ్రీముఖికి రెమ్యూనరేషన్ విషయంలో కాస్త ఇబ్బంది పెట్టినట్లుగా తెలుస్తోంది..అందుచేతనే ఆమె ఈ షో కి యాంకర్ గా చేయలేదని సమాచారం. అంతేకాకుండా ఈ షోలో చేస్తే ఒకవేళ అందరూ అనసూయతోనే పోలుస్తారని ఆమె కాస్త గెల్టీగా ఫీల్ అవ్వడం వల్ల వద్దనుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై శ్రీముఖి క్లారిటీ ఇస్తే తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: