
బాలకృష్ణ ,రానా ,విజయ్ దేవరకొండ తో పాటు ఇంకా పలువురు హీరోలను బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే హీరో నాని నీ కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో నాని బిగ్ బాస్ హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే.. ఇక రెండవ సీజన్ కు నాని హోస్టుగా నిర్వహించగా ఆ సమయంలో నాని పోయిన కూడా తీవ్రమైన విమర్శలు వెళ్ళబడ్డాయి. దీంతో చాలామంది నాని పైన వ్యక్తిగతంగా కూడా పలు విమర్శలు చేయడంతో ఆ ఒక్క సీజన్ తరువాత నాని గుడ్ బై చెప్పేశారు.
కానీ ఈసారి మళ్లీ తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ నిర్వహకులు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ నాని మాత్రం నూటికి నూరు శాతం నో చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారని ఆయన అభిమానులు తెలియజేస్తున్నారు.. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ స్టేజ్ ఎక్కి చేజేతులారా కష్టాలని కొని తెచ్చుకోవడం ఇష్టం లేదన్నట్లుగా సమాచారం. కానీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. నానికి బిగ్ బాస్ నిర్వాహకులు రూ.5 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపించాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.