జనసేన క్యాంపెనర్ గా చాలా మంది జబర్దస్త్ కమెడియన్స్ ఇటీవలే పాల్గొంటున్నారు..ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు కూడా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే హైపర్ ఆది కూడా గడిచిన మూడు రోజుల నుంచి ఎక్కువగా పిఠాపురం నియోజవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు.. ఇలా పిఠాపురంలో పలు మండలాల్లో కూడా పర్యటన చేస్తున్న హైపర్ ఆది ఏపీ ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో విమర్శలుగా చేయడం జరిగింది. పిఠాపురంలో ఇటీవలే పర్యటించిన హైపర్ ఆది మీడియాతో మాట్లాడారు.

హైపర్ ఆది మాట్లాడుతూ అధికార ప్రతిపక్ష నేతల పైన కూడా విమర్శలు చేస్తూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి భారీగానే స్పందన వస్తోందని ఖచ్చితంగా ఆయన లక్ష మెజారిటీతో గెలవడం ఖచ్చితం అంటూ వెల్లడించారు. ముఖ్యంగా పిఠాపురం టిడిపి నేతగా ఉన్నటువంటి వర్మ గారికి ఈ విషయంలో అండగా ఉన్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ గత కొంతకాలంగా నియోజకవర్గ ప్రజలతో ఎంతో అనుబంధం ఉన్న వర్మ గారు పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేయడం చాలా ఆనందంగా ఉందంటూ వెల్లడించారు.


ఇక మీడియా వారు.. జబర్దస్త్ కమెడియన్ల చేత ప్రచారం చేస్తున్నారు అనే విషయం పైన మీ స్పందన ఏంటి అని హైపర్ ఆదిని అడగగా అందుకు హైపర్ ఆది మాట్లాడుతూ.. మేము ప్రొఫెషనల్ గా కమెడియన్స్.. వాళ్లలాగా మేము పొలిటికల్ కమెడియన్స్ కాదు అంటూ సెటైర్లు వేయడం జరిగింది. ప్రస్తుతం హైపర్ ఆది చేసిన ఈ వాక్యాలు అటు రాజకీయాలలో మరొకసారి సంచలనాలకి దారి తీసేలా కనిపిస్తున్నాయి..అయితే పిఠాపురం లోనే కాకుండా జనసేన అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా హైపర్ ఆది పర్యటించి వారి యొక్క గెలుపు కోసం ప్రయత్నిస్తానంటూ హైపర్ ఆది వెల్లడించారు. మరి జబర్దస్త్ కమెడియన్స్ యొక్క ప్రచారం జనసేన పార్టీకి ఏ విధంగా  ఉపయోగపడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: