స్టార్ మా లో కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 2 సీజన్ షో ఇప్పటికే 10 ఎపిసోడ్లను కూడా పూర్తి చేసుకున్నది.. అయితే మొదటి సీజన్ మసాలా అయితే రెండవ సీజన్ గరం మసాలా అనేలా డిజైన్ చేశారు. ఇటు సీరియల్స్ తో అటు బిగ్ బాస్ సెలబ్రిటీలు మరింత మరి రెచ్చిపోయి ఈ షోలో అందాల ఆరబోతతో ఈ టచ్ చేస్తూ ఉన్నారు. వీరందరికీ తోడుగా యాంకర్ అనసూయ కూడా మరింత అందంగా కనిపిస్తూ షోలో హీటెక్కించేలా చేస్తోంది. తాజాగా ఈ షో కి సంబంధించిన ఒక వీడియో స్టార్ మా ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారుతున్నది.


ఓ ఎపిసోడ్లో యాంకర్ అనసూయ స్టేజ్ మీద బాయ్స్ అందరితో కలిసి డాన్స్ చేస్తూ ఉండగా ఆ సమయంలోనే బిగ్ బాస్ ఫేమ్ పృథ్వి అనసూయని ఎత్తుకొని మరి డాన్స్ చేస్తూ ఉన్నట్టుగా ఈ వీడియోలో చూపించారు. అయితే ఇది అనసూయ కూడా ఊహించని విధంగా మొదట ఉలిక్కిపడినట్టుగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఎలాగోలాగా మేనేజ్ చేసినప్పటికీ సెట్ లో ఉన్న వారంతా పృథ్వి చేసిన పనికి ఒక్కసారిగా కంగు తిన్నారు.


ముఖ్యంగా అమ్మాయిల గ్యాంగ్ అయితే ఒక్కసారిగా విరుచుకు పడ్డట్టుగా కనిపిస్తోంది.శ్రీముఖి వేసిన ప్రశ్నకు శేఖర్ మాస్టర్ ఏం మాట్లాడాలో తెలియక సతమతమవుతున్నట్టుగా కనిపించారు. రోహిణి వచ్చి పృథ్వీ ఏం చేశావయ్యా నేను ఒక్కసారిగా ఉలిక్కిపడిపోయాను అంటూ తెలియజేసింది. దీనికి నేను ఏం చేయాలంటూ పృథ్వి నవ్వుతూ తెలియజేశారు. అయితే ఈ వీడియో పైన శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. సీజన్ 2 స్టార్ట్ చేస్తున్నప్పుడు అందరం కూడా డాన్స్ చేశాము అప్పుడు పృథ్వి కనీసం కాలు కూడా కదపలేదు.. ఇప్పుడు అనసూయ చేయి పడగానే ఏకంగా మూన్  వాక్ అంటూ శేఖర్ మాస్టర్ కామెంట్స్ చేయడం జరిగింది. తాజాగా ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: