బుల్లితెర సీరియల్ నటుడు అమర్ దీప్ ,తేజస్విని గౌడ ప్రేమించి మరి వివాహం చేసుకుంది. వీరి వివాహం డిసెంబర్11-2022న జరిగింది.. అమర్ దీప్ బిగ్ బాస్ తెలుగు 7 రన్నర్ గా నిలిచారు. ఈ క్రేజీతోనే పలు సినిమాలలో కూడా అవకాశాలను అందుకోవడం జరిగింది. వివాహమనంతరం అటు తేజస్విని , అమర్ ఇద్దరు కూడా హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో విడాకుల రూమర్స్ వినిపించాయి. ఈ విషయం పైన తేజస్విని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిన ఇప్పుడు మరొకసారి క్లారిటీ ఇచ్చింది.


తాజాగా ఆహలో మొదలవుతున్న కాకమ్మ కథలు సీజన్ 2 ప్రోమో రిలీజ్ కాగా ఇందులో యాంకర్ రవితో పాటు నటి తేజస్విని గౌడ కూడా వచ్చారు. హోస్టుగా తేజస్వి మదివాడ వ్యవహరిస్తున్నది. ఈ షోలోనే తేజస్విని గౌడ తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతోందనే రూమర్స్ పైన మాట్లాడుతూ.. ఈ విషయం విన్న తర్వాత తేజస్విని గౌడ సైలెంట్ గా ఉంటూ ఈ మధ్యకాలంలో తాను ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రశ్న ఇదని ఈ సందర్భంలో తనకు తన తండ్రి ఉండి ఉంటే బాగుండు అనిపించిందనీ ఎమోషనల్ గా మాట్లాడింది తేజస్విని గౌడ. ఆ తరువాత తేజస్విని వచ్చి మరి తేజు ని ఎమోషనల్ గా హత్తుకుంది.


అలాగే బిగ్ బాస్ హౌస్ లోకి తేజు వెళుతుందా అనే ప్రశ్న వేయగా కాస్త గ్యాప్ ఇచ్చి ఏదో ఆన్సర్ చెప్పినట్టుగా చూపించారు. గతంలో ఒక టాక్ షోలో కూడా తేజస్విని గౌడ ఇవన్నీ కూడా రూమర్స్ అంటూ చెప్పుకొచ్చింది. భార్య భర్తలు అన్న తర్వాత గొడవలు సహజంగానే ఉంటాయి.. వాటికి విడిపోతారా అంటూ తెలియజేసింది.. తన భర్త కంటే తనకు ఎవరూ ఎక్కువ కాదని తెలియజేసింది తేజస్విని గౌడ. అంతేకాకుండా త్వరలోనే పండంటి బిడ్డకు కూడా జన్మనివ్వబోతున్నామనే విధంగా తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: