శాంసంగ్ సరికొత్త ఫోన్ ని విడుదల చేసింది. ఈ ఫోన్ బాగా ఆకట్టుకునేలానే ఉంది. ఈ  బ్రాండ్ ని ఇష్ట పడని వారు ఎవరు ఉండరనే అనాలి. దీనికి గల కారణం శాంసంగ్ తక్కువ ధర లో కూడ  మొబైల్స్ ని అందివ్వడమే. ఎప్పుడు కూడా ఈ ఫోన్స్  బడ్జెట్ రేంజ్  నుండి ప్రీమియం వరుకు కూడా అందుబాటు లో ఉంటూ వినియోగదారులకి ఆకట్టుకుంటాయి.  ఇది ఇలా ఉండగా ఇప్పుడు తాజాగా గెలాక్సీ ఎం 01 ని తీసుకు వచ్చింది. ఈ గెలాక్సీ ఎం సిరీస్ లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది, అయితే ఇప్పుడూ ఈ ఫోన్ లాంచ్ అయి ఒక నెల కూడా కాక ముందే ఇప్పుడూ శాంసంగ్ మళ్ళి గెలాక్సీ ఎం 01 ఎస్ ను కూడ లాంచ్ చేయనుంది.


ఫోన్ వివరాల్లోకి వెళితే....  గెలాక్సీ  M01s స్మార్ట్ ఫోన్ ధర రూ. 8,999 మాత్రమే.  స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి కూడ తెలిసిందే. ఈ ఫోన్ గురించి వస్తున్న వార్తలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అలానే పలు విషయాలు కూడా లీక్ అయ్యాయి. వాటి వివరాలు ఇవే... శాంమొబైల్ ఇప్పుడు తెలిపిన కథనం ప్రకారం ఈ శాంసంగ్ గెలాక్సీ ఎం 01 ఎస్ స్మార్ట్ ఫోన్ లో బేస్ వేరియంట్ లో 32 జీబీ స్టోరేజ్ ఉండనుంది అని తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా  రంగుల విషయం లో కి వస్తే.... బ్లూ, గ్రే ఇలా రెండు కలర్ ఆప్షన్స్ ఉండనున్నట్లు కూడ ఇప్పుడు సమాచారం అందింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టం తో నే పని చేయనుంది. ఇది విడుదల అయిన తరువాత దీనికి ఆండ్రాయిడ్ 10 వస్తుంది అని వార్తలు వచ్చాయి. మరి పూర్తి వివరాల కోసం వేచి ఉండక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: